
నందమూరి బాలకృష్ణ నందమూరి ఎన్టీఆర్ వారసుడిగా సినిమా పరిశ్రమలోకి వచ్చి తండ్రికి తగ్గ తనయుడిగా మంచి పేరు సంపాదించుకున్నాడు. తనదైన స్టైల్లో డైలాగ్ డెలివరీ తో ప్రేక్షకులను ఆకట్టుకుని ఎంతోమందిని అభిమానులను మార్చుకున్న బాలకృష్ణ యాక్షన్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచాడు. ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ సినిమా చేస్తున్నాడు బాలకృష్ణ. ఆ తర్వాత మాస్ దర్శకులు అనిల్ రావిపూడి, గోపీచంద్ మలినేని వంటి దర్శకులతో సినిమాలు చేస్తున్నారు.

ఈయన ఇంతటి పేరు తెచ్చుకోవడానికి హీరోయిన్ ల సహకారం ఎంతో ఉందని తెలుస్తోంది. వారితో బాలయ్య నటించడం వల్ల, బెస్ట్ పైర్ అనిపించు కోవడం వల్ల ఆ సినిమాలు బ్లాక్ బస్టర్ అయ్యాయి. ఆ విధంగా హీరోయిన్ లు బాలకృష్ణ ను స్టార్ హీరో చేశారట.ఏదేమైనా మన బాలకృష్ణ నటనకు హీరోయిన్ ల గ్లామర్ తోడై ఇప్పుడు వారు ఈ స్థాయి కి చేరుకోవడానికి దోహదపడింది. అలా బాలకృష్ణ సరసన హీరోయిన్ ల గురించి ఇప్పుడు చూద్దాం. 

లేడీ అమితాబ్ విజయశాంతి తో ముద్దుల మామయ్య లారీ డ్రైవర్ ఇన్స్పెక్టర్ రౌడీ నిప్పురవ్వ కథానాయకుడు భానుమతిగారి మొగుడు వంటి సినిమాల్లో నటించి ఆయనకు సరైన జోడీ గా నిలిచింది. అల్లరి కృష్ణయ్య, అనసూయమ్మగారి అల్లుడు , అపూర్వ సోదరులు వంటి పలు సినిమాల్లో భానుప్రియ బాలకృష్ణ ల జోడీ ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. రోజా భైరవద్వీపం మాతో పెట్టుకోకు పెద్దన్నయ్య గాండీవం వంటి సినిమాల్లో నటించి హిట్ ను అందుకుంది. సుహాసిని తో బాలకృష్ణ మంగమ్మగారి మనవడు, బాలగోపాలుడు ప్రెసిడెంట్ గారి అబ్బాయి సినిమా లో సూపర్ హిట్ అయ్యాయి.

సిమ్రాన్ తో సమరసింహారెడ్డి నరసింహనాయుడు సీమసింహం వంటి సినిమాలతో ఆకట్టుకోగా రమ్యకృష్ణ వంశానికొక్కడు వంశోద్ధారకుడు బంగారు బుల్లోడు సినిమాలు చేసింది. నయనతార శ్రీరామరాజ్యం, సింహ సినిమాలలో నటించి చూడచక్కని జోడీ అనిపించుకున్నారు.
