పెళ్లి చూపులు సినిమా తో టాలీవుడ్ కి దర్శకుడిగా పరిచయమైన టాలెంటెడ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్. తొలి సినిమాతో సూపర్ హిట్ నమోదు చేసుకొని టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అయ్యే ఏ విధంగా ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్నాడు. విజయ్ దేవరకొండ లాంటి స్టార్ ఉద్భవించిన పెళ్లి చూపులు సినిమా విజయ్ దేవరకొండ కు ఎంత పెద్ద పేరును తీసుకువచ్చిందో దర్శకుడు తరుణ్ భాస్కర్ కూడా అంతే పేరును తీసుకువచ్చింది. ఎంతో ఫ్రెష్ గా ఆహ్లాదకరమైన కామెడీ తో ఈ సినిమా తెరకెక్కింది. అందుకే ప్రేక్షకాభిమానులు ఈ సినిమా ను సూపర్ హిట్ చేశారు.

సినిమా తరువాత విజయ్ దేవరకొండ స్టార్ హీరోగా ఎదిగగా తరుణ్ భాస్కర్ తన తదుపరి చిత్రాన్ని కొత్తవారితో ఈ నగరానికి ఏమైంది అనే సినిమాను చేశాడు. ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద మంచి ఫలితాన్ని అందుకుంది. విశ్వక్ సేన్ వంటి మరో అగ్రేసివ్ హీరో ను తెలుగు తెరకు పరిచయం చేయించాడు తరుణ్ భాస్కర్. అయితే పెళ్లి చూపులు సినిమాతో పోల్చుకుంటే ఈ సినిమా తక్కువగా హిట్ అయిందని చెప్పవచ్చు. ఇదిలా ఉంటే తరుణ్ భాస్కర్ తన మూడవ సినిమా చేయడానికి చాలా రోజులు పట్టింది. ఇప్పటికీ తన మూడవ సినిమా అనౌన్స్ చేయలేదు తరుణ్ భాస్కర్. 

ఈ నగరానికి ఏమైంది సినిమా వచ్చి చాలా సంవత్సరాలు అయి పోతున్నా తరుణ్ భాస్కర్ మాత్రం తన తదుపరి చిత్రాన్ని ఇప్పటి వరకు అనౌన్స్ చేయకపోవడంతో ఆయన అభిమానులు ఎంతో నిరాశ లో ఉండిపోయారు. గత కొన్ని రోజులుగా ఆయన వెంకటేష్ తో సినిమా చేయబోతున్నాడని సురేష్ బాబు కాంపౌండ్ లోనే ఉన్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎప్పటినుంచో వెంకటేష్ తో సినిమా అని చెబుతున్న ఆ సినిమా ఇంకా పట్టాలెక్కకపోవడం అందరిని ఆశ్చర్యపరుస్తుంది. వెంకటేష్ మాత్రం వరుస కొత్త సినిమాలు ఒప్పుకుంటూ పోతున్నాడు తన తదుపరి చిత్రాన్ని త్రివిక్రమ్తో చేయనున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి ఈ నేపథ్యంలో తరుణ్ ఇంకెన్నాళ్లు తన మూడో సినిమా కోసం ఎదురు చూడాలో చూద్దాం. 

మరింత సమాచారం తెలుసుకోండి: