కరోనా  మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో ప్రతి ఒక్కరు, పలు జాగ్రత్తలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. అంతేకాదు స్వీయ జాగ్రత్తలు తీసుకుంటూనే, ఇతరులకు  కూడా పలు జాగ్రత్తలు తీసుకోమని సలహాలిస్తుంటారు. ఎందుకంటే ఎవరి నుంచి, ఎప్పుడు, ఎలా , ఈ వైరస్ మనకు సంక్రమిస్తుందో , తెలియక ప్రతి ఒక్కరూ ముందుగానే పలు జాగ్రత్తలు తీసుకోవడం గమనార్హం. ఈ కరోనా మహమ్మారి వచ్చి,  ప్రతి ఒక్కరికి పరిశుభ్రతను నేర్పించింది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. బద్ధకస్తులు కూడా ఎప్పటికప్పుడు శుభ్రంగా తమను తాము ఉంచుకోవడం తోపాటు  పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతున్నారు.


ఇక సినీ ఇండస్ట్రీ వర్గాల విషయానికి వస్తే, సాధారణంగా లిప్ లాక్ అంటే హాలీవుడ్ సినిమాలలో బాగా విపరీతంగా చూపించేవారు. ఇక ఇదే పద్ధతిని బాలీవుడ్ సినీ రంగాలు కూడా పాటిస్తున్నాయి. బాలీవుడ్ లో  సుమారుగా వచ్చే చిత్రాలలో లిప్ లాక్ సన్నివేశాలను,  మనం నాటి నుంచీ చూస్తూనే ఉన్నాం. ఇక ఇదే పద్ధతి మన తెలుగు సినీ ఇండస్ట్రీకి కూడా పాకిందని చెప్పవచ్చు. అర్జున్ రెడ్డి సినిమా తో బాగా పాపులారిటీ అందుకున్న ఈ లిప్ లాక్ సన్నివేశం,  ప్రస్తుతం రొమాంటిక్ చిత్రాలు అన్నింటిలోనూ ఈ సన్నివేశాలను జోడించడం గమనార్హం. అయితే ఇప్పుడు ఒక సినిమాలో కూడా లిప్ లాక్ సన్నివేశం ఉందని, డైరెక్టర్ ఆ సన్నివేశంలో హీరో హీరోయిన్ల మధ్య లిప్ లాక్ సన్నివేశం ఉంటుందని చెప్పాడట.


అయితే నిర్మాత మాత్రం హీరో హీరోయిన్ ఎవరైనా సరే, 14 రోజుల పాటు క్వారంటైన్ ఉన్న తరువాతనే, వారికి ఎటువంటి పాజిటివ్ తేలకపోతేనే,ఆ తర్వాత లిప్లాక్ సన్నివేశాన్ని చేద్దామంటూ కండిషన్ పెట్టాడట నిర్మాత. ఇక వారిరువురూ 14 రోజులపాటు క్వారంటైన్  లేకపోతే ఆ సన్నివేశాన్ని కచ్చితంగా సినిమా నుంచి తొలగించాలని, నిర్మాత గట్టిగా వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం. ఏది ఏమైనా సినీ ఇండస్ట్రీలో కూడా ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవడం, అందరికీ కొంత ఆశ్చర్యం గా ఉన్నప్పటికీ, తప్పకుండా దర్శక నిర్మాతలు ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని వారిని అభినందిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: