
అక్కినేని నాగ చైతన్య వరుస సినిమాలు చేస్తూ హిట్ లు కొడుతూ మీడియం రేంజ్ హీరోగా ఎదిగాడు. అక్కినేని వంశం నుంచి మూడోతరం హీరోగా వచ్చిన అక్కినేని నాగ చైతన్య జోష్ సినిమాతో టాలీవుడ్ కి పరిచయమై ఆ తర్వాత ఏ మాయ చేసావే చిత్రంతో హిట్ సంపాదించుకుని నటుడు గా ఎదిగాడు. ప్రస్తుతం ఆయన హీరోగా చేసిన లవ్ స్టోరీ అనే సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. కరోనా కారణంగా ఈ సినిమా విడుదల వాయిదా పడుతూ రాగా త్వరలోనే ఈ సినిమా థియేటర్లలో విడుదల చేస్తామని నిర్మాతలు చెబుతున్నారు.
ఈ సినిమా రిలీజ్ కాకముందే అక్కినేని నాగచైతన్య విక్రమ్ కుమార్ దర్శకత్వంలో అనే వెరైటీ సినిమాను చేశాడు ఇప్పటికే సగభాగం షూటింగ్ పూర్తయిందని తెలుస్తోంది. రాశిఖన్నా హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా త్వరలోనే పూర్తి వివరాలను వెల్లడించింది. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన మనం సినిమా సూపర్ హిట్ కాగా ఈ సినిమాపై కూడా సహజంగానే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇదే కాకుండా అక్కినేని నాగచైతన్య బాలీవుడ్ లో అమీర్ ఖాన్ చేస్తున్న లాల్ చడ్డా సింగ్ అనే సినిమాలో ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు.
తాజాగా అక్కినేని నాగచైతన్య ఓ టీ టీ లో అడుగుపెట్టేందుకు సిద్ధం అవుతున్నారని తెలుస్తోంది. తాజాగా అందుతున్న నివేదిక ప్రకారం ఆయన నిర్మాత శరత్ మరార్ తో ఓ టీ టీ లో సినిమా చేసేందుకు చర్చలు జరుపుతున్నారట. ఇది పూర్తిగా ఓ టీ టీ ఒరిజినల్ చిత్రంగా రూపొందుతుందని అంటున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తి అయ్యిందట. ప్రస్తుతం దర్శకుడు వేటలో ఉన్నట్లు తెలుస్తుంది. సరైన దర్శకుడు దొరికితే వెంటనే సెట్స్ పైకి వెళతారట. మరి నాగ చైతన్య ఈ ఓటీటీ ప్రయత్నం ఎంతవరకు సఫలం అవుతుందో చూడాలి.