సినిమా పరిశ్రమలో
హీరోయిన్ లు ఎంతో జాగ్రత్తగా ఉండకపోతే వారు తొందరగానే ఫేడ్ అవుట్ అయిపోయే ప్రమాదం ఉంది. వచ్చిన సినిమాలను నిలబెట్టుకుంటూ వరుసగా హిట్ లు కొట్టిన వారే
సినిమా రంగంలో చాలా రోజులు కొనసాగుతారు. లేదంటే కొన్ని సినిమాలతోనే వెనక్కి వెళ్లిపోతారు. ఆ విధంగా
హీరోయిన్స్ కెరియర్ చాలా తక్కువగా ఉంటూ ఆ తర్వాత తమ పర్సనల్ జీవితంలో సెటిల్ అయిపోతారు. ఒకప్పుడు
హీరోయిన్ గా
టాలీవుడ్ లో ఓ వెలుగు వెలిగి ఇండస్ట్రీకి దూరమైపోయింది
ఎన్టీఆర్ సినిమాలో నటించిన ఓ హీరోయిన్. ఆమె సోనాలి జోషి.
ఈ
సినిమా జూనియర్
ఎన్టీఆర్ అభిమానులను, ప్రేక్షకులను ఎంతగానో నిరాశపరచడంతో సోనాలి కి పెద్ద గా పేరు రాలేదు. ఈ
సినిమా తర్వాత ఈ
భామ పెద్దగా ఎక్కడా కనిపించలేదు. ప్రస్తుతం వెబ్ సిరీస్ లు తెరకెక్కుతున్న నేపథ్యంలో ఫేడ్ అవుట్ అయిపోయిన
హీరోయిన్ లు ఈ తరహా
సినిమా లలో ఎక్కువగా నటిస్తున్న నేపథ్యంలో ఈమె
అమెజాన్ ప్రైమ్ లో రాబోయే ఓ వెబ్ సిరీస్ చేయడానికి ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.
అమెజాన్ ప్రైమ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించే ఈ సిరీస్ లో ఆమె సెకండ్ ఇన్నింగ్స్ చేయబోతున్నట్లు తెలుస్తోంది.
బాలీవుడ్ లో ఎక్స్ క్యుజ్ మీ అనే
సినిమా ద్వారా సినీ పరిశ్రమకు పరిచయమైన ఈమె ఆ తర్వాత అభి, రాంబాబు గాడి పెళ్ళాం, నేను
నాన్న అబద్దం అనే సినిమాలలో నటించింది. అయితే ఇవేమీ ఆమె పేరు తీసుకు రాకపోగా ఆమె క్రేజ్ ను తగ్గించేశాయి. సుబ్బు
సినిమా మాత్రమే ఆమె కెరీర్ లో చేసిన మంచి సినిమా. మొత్తానికి ప్రస్తుతం ఆమె వెబ్ సిరీస్ లో నటించడం కొత్త అందాన్ని కోరుకునే వారికి కొంత ఊరట కలిగిస్తుంది. సోషల్
మీడియా లో ఈమెకు సంబంధించిన ఒక ఫోటో వైరల్ కాగా ఇందులో ఆమె గుర్తుపట్టలేని విధంగా మారిపోవడం అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది. సుబ్బు సినిమాలో కనిపించిన ఆ పిల్లేనా ఈమె అని కామెంట్లు పెడుతున్నారు.