బుల్లి తెరపై ఓ రేంజ్ లో దూసుకుపోతున్న సీరియల్ కార్తీకదీపం.
స్టార్ మా లో ప్రసారం అవుతున్న ఈ సీరియల్ కు ఏ రేంజ్ లో క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తెలుగు రాష్ట్రాలలో ఈ సీరియల్ కు భారీ ఫాలోయింగ్ ఉంది. ఎలాంటి అవాంతరాలు వచ్చిన ఈ సీరియల్ ను చూడడం మాత్రం ఆపరు తెలుగింటి ఆడపడుచులు. భారీ టిఆర్పి రేటింగ్ దుమ్మురేపుతున్న ఈ సీరియల్
టాలీవుడ్ లో ప్రస్తుతం నెంబర్ వన్ గా ఉన్న సీరియల్ అని చెప్పవచ్చు. ఏ
ఈవెంట్ కూడా ఈ సీరియల్ ను చూడకుండా వారిని ఆపదు.
ఈ సీరియల్ ను మగవారు సైతం ఎంతో ఇంట్రెస్ట్ గా ప్రతిరోజు వీక్షిస్తుండడం విశేషం. హాట్ స్టార్ వంటి యాప్ లలో రెండేసి సార్లు వీక్షిస్తున్నారు. మలయాళం నుంచి తెలుగులో
రీమేక్ చేసిన ఈ సీరియల్ ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరు చూస్తున్నారు. వంట లక్క గా ప్రేమి విశ్వనాథ్ కనిపిస్తుండగా తన అభినయంతో ఎంతోమంది కోట్లాది మంది ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ప్రతి ఒక్కరికీ సెలబ్రిటీలకు సైతం ఈ సీరియల్ అభిమాన సీరియల్ గా మారింది. ఇక అత్త పాత్రలో నటించిన
అర్చన కి కూడా అదే రేంజ్ లో అభిమానులు ఉన్నారు.
బుల్లితెర పైన మాత్రమే కాకుండా వెండితెరపై కూడా అప్పుడప్పుడు మెరుస్తూ తన సత్తా చాటేందుకు ప్రయత్నాలు చేస్తుంది. ఇటీవలే థాంక్యూ బ్రదర్ అనే సినిమాలో
హీరో తల్లి పాత్రలలో నటించింది ఈమె. ఆమె అందానికి నటనకు అభిమానులుగా మారారు అందరూ. అంతేకాకుండా ఇంకా కేరాఫ్
అనసూయ అనే పాత్రలో కూడా నటిస్తుంది. గత కొన్ని రోజులుగా ఈ సీరియల్ లో
అర్చన కనిపించట్లేదు. దీంతో ఆమె అభిమానులు ఎంతో నిరుత్సాహం చెబుతున్నారు.ఈమెను కావాలనే తీసేశారా లేదా వేరే కారణాలు ఏమైనా ఉన్నాయా అని ఆమె గురించి వెతుకుతున్నారు. ఆమెకు
సినిమా అవకాశాలు రావడం వల్లే ఈ సీరియల్ నుంచి తప్పుకున్న ది అనే వార్త వినిపిస్తుంది.