సాధారణంగా సినీ సెలబ్రిటీలు ఏదైనా స్టేట్మెంట్ ఇచ్చారు అంటే అది ఎంతో వైరల్ గా మారిపోతూ ఉంటుంది. అయితే కొన్ని కొన్ని సార్లు సెలబ్రిటీలు స్టేట్మెంట్ ఇచ్చిన ప్రకారం కాకుండా దానికి విరుద్దంగా నడుచు కుంటూ ఉంటారు. దీంతో సోషల్ మీడియాలో ఎన్నో విమర్శలు కూడా ఎదుర్కొంటూ ఉంటారు.  గతంలో ప్రియాంక చోప్రా కి కూడా ఇలాంటిదే జరిగింది. ప్రస్తుతం నిక్ జోనస్ తో పెళ్లి తర్వాత ప్రియాంక చోప్రా గ్లోబల్ స్టార్ గా మారిపోయింది  బాలీవుడ్ చిత్ర పరిశ్రమలోనే కాదు అటు హాలీవుడ్లో కూడా అవకాశాలు అందుకుంటూ ప్రేక్షకులను అలరిస్తుంది ఈ ముద్దుగుమ్మ. అయితే  ప్రస్తుతం ప్రియాంక చోప్రా ను  ట్రోలర్స్ ఆడుకుంటున్నారు.



 ఒకప్పుడు దిపావాలి సందర్భంగా తనకు ఆస్తమా ఉందని అందుకే దీపావళి పండుగకు ఎంతో దూరం ఉంటున్నాను అంటూ సోషల్ మీడియా వేదికగా ఒక పోస్టు పెట్టింది ప్రియాంక చోప్రా. తన అభిమానులు కూడా బాణసంచా నుండి వచ్చే పొగ వల్ల దూరంగా ఉండాలి అంటూ సూచించింది  ఒకరకంగా అసలు టపాసులు కాల్చ వద్దు అంటూ పరోక్షంగానే తన పోస్టులో చెప్పింది ప్రియాంక. ఈ క్రమంలోనే ఎంతోమంది అభిమానులు ప్రియాంక చోప్రా చెప్పినట్లుగానే ఇక పొగకు దూరంగా ఉన్నారు. ఇక తమ అభిమాన హీరోయిన్ చెప్పిన తర్వాత పాటించకుండా ఉంటారా.



 ఇక్కడి వరకు అంతా బాగానే ఉన్నప్పటికీ.. ఇటీవలే తన 37 వ పుట్టినరోజు సందర్భంగా తన భర్త నిక్ జోనస్ తో కలిసి ఒక రెస్టారెంట్లో సిగరెట్ తాగుతూ ప్రత్యక్షం అయింది ప్రియాంక చోప్రా. నాకు ఆస్తమా ఉంది పొగకు దూరంగా ఉంటాను అంటూ స్టేట్మెంట్ ఇచ్చిన ప్రియాంక చోప్రా. ఏకంగా సిగరెట్ తాగడం తో అందరూ షాక్ అయిపోయారు. సోషల్ మీడియా వేదికగా ట్రోల్స్ మొదలుపెట్టారు. ఒకప్పుడు అన్నింటికీ దూరంగా ఉన్న ప్రియాంక చోప్రా నిక్ జోనస్ తో పెళ్లి తర్వాత అమెరికా కల్చర్ కి అలవాటు పడిందని సిగరెట్లతో పాటు పలు చెడు అలవాట్లు కూడా ప్రియాంక చోప్రా కి అలవాటయ్యాయి ఫన్నీ ట్రోల్స్ మొదలుపెట్టారు. ఇక ఇటీవలే మరోసారి అన్షుల్ సక్సెనా ప్రియాంక చోప్రా సిగరెట్ తాగిన ఫోటోని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఒక కామెంట్ చేయడం హాట్ టాపిక్గా మారిపోయింది. ద లెజెండ్ ప్రియాంక చోప్రా.. ప్లీజ్ మేరే సాన్స్ కొ బెరొక్ రఖీయే అంటూ సెటైరికల్ కామెంట్ చేశారు  దీంతో మరోసారి ప్రియాంక చోప్రా సిగరెట్ తాగిన ఫోటో వైరల్ గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: