సినీ పరిశ్రమలో టాప్ హీరోగా ఉన్న చాలా మందికి కొన్ని అభిరుచులు ఉంటాయి. ఒకరికి విదేశాలకు వెళ్లడం ఇష్టం అయితే, మరికొందరికీ వస్తువులు కొనడం ఇష్టం. కొంతమందికి కార్లు బైకులు అంటే ఇష్టం. అలా జూనియర్ ఎన్టీఆర్ కు కార్లు అంటే అమితమైన ప్రేమ అన్న విషయం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇప్పటికే ఆయన ఇంట్లో రకరకాల కంపెనీలకు చెందిన టాప్ మోడల్ కార్లు ఉండగా ఇటీవలే లంబోర్ఘిని కంపెనీకి చెందిన లేటెస్ట్ మోడల్ కారు తన గేటు ముందు వాలింది.

అయితే ఆ కారు ఎలా ఉంటుందో అని ఎదురు చూసిన తారక్ అభిమానులకు కార్ కు సంబంధించిన ఫోటో ఒకటి ఇప్పుడు బయటకు లీక్ అవ్వడం అందరిని సర్ ప్రైజ్ చేస్తుంది. ఇటీవలే ఎన్టీఆర్ కు చేరిన ఈ కారును ఓ అభిమాని చూడగానే క్లిక్ మనిపించి సోషల్ మీడియాలో అందరితో పంచుకున్నాడు. దీనికి సంబంధించిన ఫొటోలు వైరల్ గా మారుతున్నాయి. నారింజ రంగులో ఉన్న ఈ కారు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ కారులో రామ్ చరణ్ ఇంటికి వెళ్లిన ఎన్టీఆర్ ఆ సమయంలోనే అభిమానులు ఈ ఫోటో తీశారు అని తెలుస్తుంది.

ఇక వీరిద్దరూ కలిసి రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ అనే సినిమా లో చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా కారణంగానే వీరిద్దరి మధ్య స్నేహబంధం పెరిగింది. గతంలో కూడా వీరు మంచి స్నేహితులు కాగా ఈ సినిమా వల్ల ఇంకా క్లోజ్ అయినట్లు తెలుస్తుంది. రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు గా ఎన్టీఆర్ కొమరం భీమ్ గా నటిస్తున్న ఈ సినిమాను దానయ్య నిర్మిస్తున్నారు. అక్టోబర్ 13న విడుదల చేస్తున్నట్లు ఇప్పటికే చిత్ర బృందం ప్రకటించింది. ఈ సినిమా తర్వాత ఈ ఇద్దరు హీరోలు తమ తదుపరి చిత్రాలను ఓకే చేసుకున్నారు. ఎన్టీఆర్ కొరటాల శివతో సినిమా చేస్తుండగా రామ్ చరణ్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు

మరింత సమాచారం తెలుసుకోండి: