
టాలీవుడ్ సినిమా పరిశ్రమలో రాణించాలంటే హీరోయిన్ లకు మొదట్లోనే సూపర్ హిట్లు దక్కాలి. ఆ విధంగా సూపర్ హిట్ దక్కితే వారికి ప్రేక్షకుల్లో క్రేజ్ పెరిగిపోయి దర్శకనిర్మాతలు వారిని హీరోయిన్ లుగా పెట్టుకోవడానికి చూస్తూ ఉంటారు. ఇప్పటి వరకు స్టార్ హీరోయిన్ గా ఎదిగిన చాలామంది కెరీర్ తొలినాళ్లలోనే సినిమాల్లో నటించి పాపులారిటీ అందుకున్నారు. అయితే కొంతమంది హీరోయిన్ లు కొన్ని కొన్ని కారణాల వల్ల సూపర్ హిట్ సినిమాలను చేసే అవకాశాలను మిస్ చేసుకుంటారు. ఆ విధంగా మన టాలీవుడ్ లోస్టార్ హీరోయిన్ లు కావాల్సిన వారు మిస్ చేసుకున్న సినిమా లు ఏంటో చూద్దాం.
టాలీవుడ్ ఇండస్ట్రీలో రికార్డుల మీద రికార్డులు సృష్టించిన సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాలో అనీషా ఆంబ్రోస్ అనే అమ్మాయి హీరోయిన్ గా అనుకున్నారు కానీ ఆమె సెట్ కాకపోవడంతో కాజల్ కి ఆ ఛాన్స్ దక్కింది. మహేష్ బాబు బిజినెస్ మాన్ సినిమా లో శృతిహాసన్ నీ అనుకుంటే కాజల్ చివరికి ఆ అవకాశాన్ని దక్కించుకుంది. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఇండస్ట్రీ హిట్ రంగస్థలం మూవీలో సమంత పాత్రకు ముందుగా అనుపమ పరమేశ్వరన్ ను అనుకున్నారు. కానీ అవకాశం అనుపమ అందుకోలేకపోయింది.
ఇటీవలే అమెజాన్ ప్రైమ్ లో విడుదలైన సూపర్ హిట్ నారప్ప మూవీ లో హీరోయిన్ గా అనుష్క ను తీసుకోవాలని అనుకున్నారు కానీ చివరి క్షణంలో ప్రియమణిని ఫైనల్ చేశారు. ప్రభాస్ నటించిన రెబల్ సినిమాలో అనుష్క నటించాల్సి ఉంది కానీ తమన్నా ఆ అవకాశాన్ని కొట్టేసింది. రాజుగారి గది 3 లో తమన్నా ను తీసుకోవాలని డైరెక్టర్ ఓంకార్ ప్లాన్ చేస్తే అది వీలు పడక అవికాను తీసుకున్నారు. గీత గోవింద మూవీ కి రకుల్ ప్రీత్ సింగ్ ను అనుకోగా రష్మిక ఫైనల్ అయింది. మహానటి మూవీ కోసం నిత్యామీనన్ ను అనుకున్నారు కానీ కీర్తి సురేష్ అవకాశం వచ్చి చేరింది. జెర్సీ సినిమాలో రష్మిక ను అనుకున్నారు కానీ మృణల్ చాకొర్ హీరోయిన్ గా తీసుకున్నారు. చెలియా సినిమాలో ఆదితి రావు బదులు సాయి పల్లవి అనుకున్నారు.