మెగా పవర్ స్టార్ తన తదుపరి చిత్రాల విషయంలో ఎంతో క్లారిటీ గా ఉన్నారు. రాజమౌళి దర్శకత్వంలో ప్రస్తుతం చేస్తున్న ఆర్ ఆర్ ఆర్ సినిమా తర్వాత రామ్ చరణ్ శంకర్ లాంటి భారీ చిత్రాలు చేసే దర్శకుడితో చిత్రం ఓకే చేయడం భవిష్యత్తులో ఎలాంటి హీరో కావాలని అనుకుంటున్నాడో  అన్న దానికి నిదర్శనంగా చెప్పవచ్చు. అందరు హీరోలు వరుస పాన్ ఇండియా సినిమాలు చేస్తూ ముందుకు పోతుంటే రామ్ చరణ్ మాత్రం ఎందుకు అలా చేయట్లేదు అని ఎదురు చూసిన అభిమానులకు రాజమౌళి మరియు శంకర్ సినిమాలు ఎంతో సంతోషాన్ని ఇస్తున్నాయి.

ఒక సినిమా సెట్స్ మీద ఉండగానే తర్వాత సినిమా మీద క్లారిటీ ఇస్తున్నారు ప్రతి ఒక్క హీరో. అంతేకాదు ఒకేసారి నాలుగైదు సినిమాలను సెట్స్ పైకి తీసుకుపోతూ టాప్ నంబర్ వన్ హీరో గా ఎదిగేందుకు ఎంతో కృషి చేస్తున్నారు.  దాంతో రామ్ చరణ్ కూడా ఆచితూచి అడుగులు వేయాల్సిన పరిస్తితి. ఒకవేళ ఒక్క సినిమా ఫలితం తేడా వచ్చినా కూడా పది సినిమాల వెనక్కి వెళ్లాల్సిన పరిస్థితి ఇప్పుడు టాలీవుడ్ లో ఏర్పడడంతో రామ్ చరణ్ చాలా తనిఖీ చేసి మరి సినిమాలు ఒప్పుకుంటున్నాడు. 

ప్రస్తుతం రెండు భారీ చిత్రాలతో ప్రేక్షకులను అలరించడానికి ముందుకు వస్తున్నాడు. ఈ నేపథ్యంలో శంకర్ సినిమా తర్వాత రామ్ చరణ్ చేయబోయే సినిమా పై ఇప్పటి నుంచే ఎంతో ఆసక్తి నెలకొంది. పలువురు యంగ్  దర్శకులు రామ్ చరణ్ తో సినిమా చేయాలని ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తుండగా వీరిలో ఎవరో ఒకరికి ఛాన్స్ ఇవ్వబోతున్నాడు రామ్ చరణ్. జర్నీ సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకున్న గౌతమ్ తిన్ననూరి, ఛలో, భీష్మ సినిమాలతో సూపర్ హిట్లు కొట్టిన వెంకీ కుడుముల, ఫ్యామిలీ చిత్రాల దర్శకుడు అనిల్ రావిపూడిలు రామ్ చరణ్ తో సినిమా చేయడానికి రెడీ గా ఉన్నారు. మరి వీరిలో ఎవరికి అవకాశం ఇస్తారో రామ్ చరణ్ చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: