తెలుగు సినిమా పరిశ్రమ సంగీతానికి ఎంతటి ప్రాధాన్యత ఇస్తుందో అందరికీ తెలిసిందే. ఎంతోమంది సంగీత దర్శకులు తెలుగు ప్రేక్షకులను తన సంగీతంతో అలరించగా వారిలో తెలుగు సినిమా సంగీత స్వరూపాన్ని మార్చి ఎన్నో కీర్తి ప్రతిష్టలు సంపాదించారు సాలూరు రాజేశ్వరరావు. తనదైన శైలిలో సంగీతాన్ని సృష్టించి ప్రేక్షకులను ఆయన పాటలతో మైమరిపింప చేశారు. ఆయన స్వరాలు సమకూర్చిన ఈ చిత్రం లోని పాటలు సంచలనమైన ఆల్బమ్ గా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంది.

మల్లీశ్వరి, ఆరాధన, ఇద్దరు మిత్రులు, డాక్టర్ చక్రవర్తి, మిస్సమ్మ , రంగుల రత్నం, మనుషులంతా ఒకటే, పూలరంగడు, కురుక్షేత్రము వంటి సినిమాలకు ఆయన సమకూర్చిన పాటలను ఇప్పటి వరకు ఎవరూ మరిచిపోలేదు. ఆయన చివరి రోజు వరకు సంగీతాన్ని శ్వాసగా పీల్చుకొని బతికారు. బెడ్ మీద ఏకంగా ఏడు సంవత్సరాలు సంగీతమే ప్రాణం గా బ్రతికారు. కృష్ణంరాజు నటించిన తాండ్ర పాపారాయుడు సినిమాకు రసగుళికల్లాంటి పాటలను అందించిన ఆయన పూర్తిగా వ్యతిరేకమైన అయ్యప్ప పూజాఫలం సినిమా ఒప్పుకొని ఆ సినిమాకు కూడా సూపర్ హిట్ పాటలను అందించాడు.

ఓ రోజు ఆయనకు ఎక్కిళ్లు రావడం మొదలై ఎంతకీ ఆగలేదు. వారికి సమీపంలో ఉండే డాక్టర్ను పిలిపించగా మందులు ఇచ్చాక ఎక్కిళ్లు తగ్గాయి. అనూహ్యంగా రాజేశ్వరరావు శరీరంలో ఒకవైపు పక్షవాతం వచ్చింది. ఆయనకు అప్పటిదాకా బీపీ షుగర్ కానీ లేవు. కానీ అప్పుడు హైబీపీ రావడం తో పాటు పెరాలసిస్ కు గురయ్యారు. ఫలితంగా ఆయన ఏడేళ్లు మంచం మీదే ఉండిపోయారు. ఉలుకు  లేదు పలుకు లేదు. కొంతకాలం హాస్పిటల్లో కొంతకాలం  ఇంట్లో బెడ్ మీద ఉన్నారు. సంగీత దర్శకుడిగా ఆయన వారసత్వాన్ని అందిపుచ్చుకొని ఆయన కుమారులు వాసు రావు కోటి సంగీత ప్రపంచంలో తనదైన ముద్ర వేసుకున్నారు. ఆయన మనవళ్ళు ఇప్పుడు ఒకరు హీరో కాగా ఇంకొకరు సంగీత దర్శకుడిగా తమ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: