టాలీవుడ్ సినిమా పరిశ్రమలో కొన్ని సినిమాలలో హీరోగా నటించిన సాయికిరణ్ అందరికీ గుర్తుండే ఉంటాడు. ప్రస్తుతం బుల్లితెరపై బిజీ ఆర్టిస్ట్ గా కొనసాగుతున్న సాయి కిరణ్ మంచి మంచి సినిమాలు చేసినా ఆ సక్సెస్ ను ఎక్కువ రోజులు నిలుపుకోలేక ఫ్లాప్ సినిమాల్లో నటించి మెల్ల మెల్ల గా కనుమరుగై పోయాడు. కానీ బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చి అక్కడ ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్నాడు. సినిమాలు మానేసిన తర్వాత బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరై సీరియల్ నటుడిగా  మంచి పేరు తెచ్చుకున్నాడు.

సినిమా జీవితం ఆయనను ఎంతగానో బాధ పెట్టినా టివి జీవితం మాత్రం ఆయనకు మంచి సంతృప్తిని కలిగిస్తుంది. అయితే సహజంగా అందరూ హీరో లాపై వచ్చే గాసిప్స్ మాదిరిగానే సాయికిరణ్ గురించి కూడా ఓ రూమర్ వైరల్ గా మారింది. ఈయన తన సినిమా జీవితాన్నీ కోల్పోవడానికి కారణం ఓ హీరోయిన్ అని చాలా వార్తలు వచ్చాయి అప్పట్లో. నువ్వేకావాలి సినిమా తో  నటుడు గా టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమై మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నాడు సాయి కిరణ్.  తొలి సినిమాతోనే ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. అందులో తరుణ్ హీరో అయినప్పటికీ సాయి కిరణ్ కు ఎంతగానో పేరు వచ్చింది. ఈ చిత్రంలోని సూపర్ హిట్ పాట అయిన అనగనగా ఆకాశం పాటను హీరో ని పక్కన పెట్టి సాయి కిరణ్ పై చిత్రీకరించడం విశేషం.

అలాగే లయ హీరోయిన్ గా నటించిన ప్రేమించు చిత్రంలో కూడా సాయికిరణ్ చాలా అద్భుతంగా నటించాడు. అయితే వరస హిట్ సినిమాలు చేస్తున్న సమయంలోనే ఒక హీరోయిన్ ప్రేమలో పడి ఆమె చుట్టూ తిరుగుతూ తన కెరియర్ ను నాశనం చేసుకున్నాడు సాయి కిరణ్ అనే వార్త ఇప్పటికీ చక్కర్లు కొడుతుంది. దాంతో వెండి తెరకు దూరమై బుల్లితెరకు పరిమితం అని అంటున్నారు. ప్రస్తుతం మనసిచ్చి చూడు అనే సీరియల్ లో నటిస్తున్న సాయికిరణ్ బుల్లితెర ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాడు. గుప్పెడంత మనసు సీరియల్ లో కూడా ఆయన తన నటనతో బాగానే ఆకట్టుకుంటున్నాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: