హీరో కార్తికేయ ఇటీవల ఎవరికి తెలియకుండా రహస్యంగా 22 ఆగస్టు 2021 రాత్రి సమయంలో నిశ్చితార్థం చేసుకున్న విషయం తెలిసిందే. దీనిపై ఆయన అభిమానులు కొంచెం అసంతృప్తిని కనబరిచారు అని చెప్పవచ్చు. ఏది ఏమైనా ఎట్టకేలకు యంగ్ హీరో కార్తికేయ కూడా ఒక ఇంటివారు అవుతున్నారని సరిపెట్టుకున్నారు. ఈయన కూడా అందరిలాగే బ్యాచిలర్ లైఫ్ కు శుభం కార్డు పలికారు. ఇక బ్యాచిలర్ గ్రూప్ నుంచి కార్తికేయ కూడా బయటకు రావడంతో, మరికొంతమంది తమకు పెళ్లి ఎప్పుడు అవుతుందో అని కూడా ఎదురు చూస్తున్న సందర్భాలు చాలానే ఉన్నాయి..ఇక ఈయన రహస్యంగా పెళ్లి చేసుకోవడంతో అందరూ ఒక్కసారిగా షాక్ కు  గురయ్యారు.  ఎందుకంటే ఆయన ఇది వరకు ఎవరితో కూడా లవ్ లో  ఉన్నట్లు ఎటువంటి వార్తలు కూడా వినిపించలేదు. కానీ ఒక్కసారిగా ఇలా నిశ్చితార్థం చేసుకోవడంతో, ఒక్కొక్కరు ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.ఇక  దీనిపై కార్తికేయ పెళ్లి చేసుకోబోతున్న అమ్మాయి ఎవరు ..? తన బంధువా..? లేక క్లాస్మేటా..?లేక తల్లిదండ్రులు చూసిన సంబంధమా ..? ఇలా పలువురు పలు రకాలుగా తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తుండడంతో కార్తికేయ ఎట్టకేలకు మౌనం వీడారు.
2010వ సంవత్సరంలో ఎన్ఐటి వరంగల్ లో మొదటిసారిగా లోహిత రెడ్డిని కలిసినట్లు సమాచారం. ఆ రోజు నుంచి ఫ్రెండ్షిప్ కాస్త ప్రేమగా మారి ఎట్టకేలకు ఆ అమ్మాయి జీవితంలోకి అడుగుపెడుతున్నట్లు తెలిపాడు. అంతేకాదు తన బెస్ట్ ఫ్రెండ్ ను వివాహం చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది అని కార్తికేయ తెలిపాడు.. అయితే వీరిద్దరిదీ లవ్ మ్యారేజ్ లేక స్నేహబంధమేనా..?  అని మరికొంతమంది కూడా ఈ అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా లోహిత రెడ్డి చూడడానికి చాలా చక్కని ముద్దు గుమ్మలా ఉంది. అంతే కాదు హీరోయిన్లతో సమానంగా తన అందం అభినయం ఉట్టి పడడంతో కార్తికేయ ఆమెను వివాహం చేసుకోబుతున్నారు అని తెలుస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: