ఈ సంవత్సరం మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎలక్షన్ లు ఎంత రసవత్తరంగా జరుగుతున్నాయో మనందరికీ తెలిసిందే. కాసేపటి క్రితమే మంచు విష్ణు తన ప్యానల్ తో మీడియా ముందుకు వచ్చి కాసేపు మీడియాతో ముచ్చటించారు. తాను చెప్పవలసిన అన్ని విషయాలు చెప్పిన మంచు విష్ణు మీడియా వాళ్లు అడిగిన ప్రశ్నలకు కూడా శాంతంగా సమాధానాలు ఇచ్చాడు. ఇందులో భాగంగా మంచు విష్ణు ప్రకాష్ రాజ్ ప్యానెల్ మరియు వారి మానిఫెస్టో మీద చురకలు అంటించారు. ఆ ప్యానల్ లో ఉన్న వారు ఎవరు సేవ చేసే వారు కాదు, వారితో నేను చిత్రాలను నిర్మించాను. వారి గురించి నాకు తెలుసు అంటూ మంచు విష్ణు మీడియా ముఖంగా తెలియజేశాడు.

 అయితే మంచు విష్ణు మీడియాతో మాట్లాడుతున్న సమయంలోనే బండ్ల గణేష్ సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ చేశాడు. బండ్ల గణేష్ జనరల్ సెక్రెటరీగా పోటీ చేస్తున్న విషయం ఇది వరకే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఎవరు ఎవరికైనా ఓటు వేసుకోండి. ఎవరు గెలిచినా ఏం పర్లేదు కానీ జనరల్ సెక్రటరీ గా నాకు ఓటు వేయండి. అంటూ కొన్ని రోజుల క్రితమే బండ్ల గణేష్ తెలియజేశాడు.  ప్రకాష్ రాజు ప్యానల్ నుండి జీవిత రాజశేఖర్ జనరల్ సెక్రటరీ పదవికి పోటీ చేస్తూ ఉండడంతో.. పంతం కొద్దీ బండ్ల గణేష్ కూడా ఆ పదవికి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగాడు. ఇక మంచు విష్ణు ప్యానెల్ నుండి రఘు బాబు పోటీకి దిగుతున్నారు. ఈ క్రమంలో బండ్ల గణేష్ మరోసారి తన స్టైల్ లో ప్రచారం చేసుకున్నాడు. ఎవరి కైనా ఓటు వేసుకోండి. కానీ జనరల్ సెక్రటరీగా నాకు మాత్రమే ఓటు వేయండి అని బండ్ల;గణేష్ తెలియజేశాడు. ఒక్క ఓటు , మా కోసం, మన కోసం , మన అందరి కోసం , మా తరపున ప్రశ్నించడం కోసం అంటూ బండ్ల గణేష్ ఒక పోస్టర్ కూడా వదిలాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: