ఇటీవలే సినిమా పరిశ్రమలో ఉన్న కొన్ని సమస్యలపై పవన్ కళ్యాణ్ నోరు విప్పిన విషయం తెలిసిందే. సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన రిపబ్లిక్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో జగన్ సర్కారు ను పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసినట్లు విమర్శలు చేసాడు. ముఖ్యంగా సినిమా పరిశ్రమలో ఉన్న సమస్యలను ఆయన ఎంతకీ పరిష్కరించకపోవడం పవన్ కళ్యాణ్ ఇంత ఆగ్రహానికి వ్యక్తం చేసింది అని చెప్పవచ్చు. సినిమా లను గవర్నమెంట్ పాలు చేయడం ఏమాత్రం సరికాదని చెబుతూ ఆయన ఈ స్థాయిలో జగన్ ను విమర్శించారు.

అయితే ఈ విమర్శలను కొంతమంది ఖండిస్తూ ఉండగా మరికొంతమంది సమర్ధిస్తున్నారు. గత కొన్ని రోజులుగా తెలుగు సినిమాలు విడుదల కాకపోవడం అందరికీ తెలిసిందే. సినిమా టికెట్ రేట్లు విషయమై ఇంకా క్లారిటీ తెలియకపోవడంతో సరైన నిర్ణయం రాకపోవడంతో నిర్మాతలు ఇన్ని రోజులు తమ సినిమాలను విడుదల చేసేందుకు వెనకాడుతు వచ్చారు. ఇప్పుడు కూడా ఆ సమస్య ను జగన్ పరిష్కరించకపోవడం తో పవన్ కళ్యాణ్ హెచ్చరించక తప్పలేదు. 

అయితే పవన్ కళ్యాణ్ గట్టిగా మాట్లాడాడు కానీ ఆయన సొంత సినిమా పరిశ్రమ నుంచి సొంత కుటుంబ సభ్యులు నుంచి కూడా ఎలాంటి సపోర్ట్ రాకపోవడం ఇప్పుడు ఆయన అభిమానులను ఎంతగానో నిరాశపరుస్తుంది. సొంత రాజకీయ ప్రయోజనాల కోసం వైసీపీ మంత్రులను తిట్టాడు దానికి మనం ఎందుకు రియాక్ట్ అవ్వడం ఏంటని కొంతమంది టాలీవుడ్ స్టార్ నటీనటులు నిర్మాతలు దర్శకులు అంటున్నారట. పవన్ లాంటి స్టార్ హీరో కి సపోర్ట్ ఇవ్వకపోవడానికి ఇండస్ట్రీ పెద్దలకు పెద్దగా అభ్యంతరం ఉండదు. కానీ రియాక్ట్ అయితే వచ్చే మైనస్ లు కూడా ఉన్నాయి. ఇప్పటివరకు అయితే నాని తప్ప మరో హీరో ఎవరు పవన్ కు మద్దతుగా మాట్లాడలేదు. అలా అని సపోర్ట్ చేయకుండా కూడా లేరు. మరి భవిష్యత్తులో ఇది దేనికి దారి తీస్తుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: