కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ముద్దుల కూతురు మంచు లక్ష్మి ఈ పేరు తెలుగు ప్రజలకు పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అంతగా మంచులక్ష్మి తెలుగు ప్రజలకు దగ్గర అయింది కాబట్టి. మంచు లక్ష్మి సిద్ధార్థ్ హీరో గా శృతి హాసన్ హీరోయిన్ గా తెరకెక్కిన అనగనగా ఓ ధీరుడు అనే సినిమాలో విలన్ గా కనిపించి తెలుగు ప్రేక్షకులను మెప్పించింది. ఆ తర్వాత లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో నటిస్తూ కూడా తెలుగు ప్రజలను మెప్పించింది. ఇలా మంచు డాటర్ కేవలం సినిమాలకు మాత్రమే పరిమితం కాకుండా అనేక బుల్లితెర షో లకు కూడా వ్యాఖ్యాతగా వ్యవహరించి మంచి ప్రశంసలు దక్కించుకుంది. ఇలా మంచు లక్ష్మి అటు వెండితెర ఇటు బుల్లితెర అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది, ఆ తర్వాత ఓ ప్రముఖ ఓటిటి లో ఒక వెబ్ సిరీస్ లో కూడా నటించింది.

మరియు తెలుగు ప్రముఖ ఓటిటి ఆహా లో కూడా ఒక వంటల  సంబంధించిన ప్రోగ్రామ్ కు కూడా మంచు లక్ష్మి వ్యాఖ్యాతగా వ్యవహరించింది. ఇలా సినిమాలు, వెబ్ సిరీస్ లు మరియు ఇతర ప్రోగ్రాం లతో ఎంతో బిజీగా సమయాన్ని గడిపే మంచులక్ష్మి సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్ గా ఉంటూ తన సినిమా షూటింగ్ అప్డేట్స్ ను మరియు ఇతర విషయాలను తన అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. ఇది మాత్రమే కాకుండా అప్పుడప్పుడు తన అంద చందాలను ప్రదర్శించేలా ఉన్న తన ఫోటోలను సోషల్ మీడియాలో అప్లోడ్ కూడా చేస్తూ ఉంటుంది. తాజాగా కూడా ఈ మంచు డాటర్ కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియాలో అప్లోడ్ చేసింది. ఈ ఫోటోలలో మంచు లక్ష్మి స్లీవ్ లెస్ బ్లౌజ్ ధరించి, చీరకట్టులో జనాలను మైమరిపిస్తుంది. ప్రస్తుతం మంచు లక్ష్మి సోషల్ మీడియాలో అప్లోడ్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: