‘లవ్ స్టోరీ’ మూవీలో రాజీవ్ కనకాల పోషించిన పాత్రకు మంచి ప్రశంసలు లభిస్తూ ఉండటంతో ఈ విలక్షణ నటుడు మంచి జోష్ లో ఉన్నాడు. ‘లవ్ స్టోరీ’ విజయవంతం కావడంతో అనేక మీడియా సంస్థలు ఇతదితో అనేక ఇంటర్వ్యూలు కూడ చేస్తున్నాయి. ఈ సందర్భంలో రాజీవ్ నాగచైతన్య వ్యక్తిత్వం పై కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేసాడు.
తాను ఇప్పటి వరకు అనేక సినిమాలలో ఎందరో ప్రముఖ నటీనటులతో నటించానని అయితే చైతన్యతో కలిసి నటించడం తనకు చాల ఆనందాన్ని ఇచ్చింది అంటూ కామెంట్స్ చేసాడు. అంతేకాదు చైతన్యను ఇష్టపడని వ్యక్తి ఎవరు ఉండరు అని చెపుతూ ఎప్పుడు నవ్వుతూ కనిపించే చైతన్య ను కేవలం అమ్మాయిలు మాత్రమే కాదు అబ్బాయిలు కూడ బాగా ఇష్టపడతారు అంటూ కామెంట్స్ చేసాడు.
ఇదే సందర్భంలో నాగచైతన్య సమంతల విడాకుల గురించి తాను స్పందించను అని అంటూ అది వారి వ్యక్తిగత జీవితం అంటూ అభిప్రాయ పడ్డాడు. వారిద్దరు విడిపోయినందుకు తనకు కూడ చాల బాధగా ఉందని అంటూ వారిద్దరి మధ్యా ఏమి జరిగిందో వారికే తెలియాలి అంటూ అభిప్రాయపడ్డాడు.
త్వరలో జరగబోతున్న ‘మా’ సంస్థ ఎన్నికల గురించి స్పందిస్తూ మంచు విష్ణు ప్యానల్ తప్పకుండా విజయం సాదిస్తుంది అన్న నమ్మకం తనకు ఉందని తమ ప్యానల్ నుంచి జనరల్ సెక్రటరీగా పోటీ చేస్తున్న రఘు బాబుకు తన పూర్తి మద్దతు ఉందని చెపుతూ తనకు జీవిత పట్ల ఎలాంటి విరోధం లేదు అని చెపుతున్నాడు. రఘు బాబు తనకు బాగా సన్నిహితుడు కాబట్టి అతడికి మద్దతు ఇస్తున్నాను అంటూ తమ గెలుపు ఖాయం అని అంటున్నాడు. ‘లవ్ స్టోరీ’ విజయవంతం కావడంతో క్యారెక్టర్ నటుడుగా రాజీవ్ కనకాల కు మరిన్ని అవకాశాలు వచ్చే ఆస్కారం ఉంది. దీనికి తగ్గట్టుగా ప్రస్తుతం పేరు మోసిన క్యారెక్టర్ ఆర్టిస్టులు అంతా భారీ పారితోషికాలు డిమాండ్ చేస్తున్న పరిస్థితులలో రాజీవ్ కు మరిన్ని అవకాశాలు వచ్చే ఆస్కారం ఉంది..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి