ఒకప్పుడు కేవలం కామెడీ హీరోలు మాత్రమే ఎక్కువగా కామెడీ ఎంటర్టైన్మెంట్ సినిమాలు చేసేవారు.  ఇక మిగతా స్టార్ హీరోలు అందరూ కేవలం యాక్షన్ కమర్షియల్ సినిమాలు మాత్రమే చేసేవారు. కామెడీ సినిమాల జోలికి అస్సలు పోయేవారు కాదు.  ఇటీవలి కాలంలో స్టార్ హీరోలు సైతం కామెడీ ఎంటర్టైన్మెంట్ సినిమాలు చేసేందుకు సిద్ధమవుతున్నారు.  ఇలా ఎన్నో రోజుల నుంచి స్టార్ హీరోలు సైతం కామెడీ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించారు. ఇలా స్టార్ హీరోలు చేసిన  సినిమాలలో బాగా చెప్పుకోదగ్గ సినిమా ఏది అంటే మహేష్ బాబు హీరోగా నటించిన దూకుడు సినిమా. శ్రీనువైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించి ఇండస్ట్రీ రికార్డులను సైతం కొల్లగొట్టింది.



 మహేష్ బాబు కెరీర్లో ఒక బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది  దూకుడు సినిమా. సినిమా లో మహేష్ బాబు నటన అయితే తెలుగు ప్రేక్షకులందరూ ఫిదా అయిపోయారు అని చెప్పాలి. ఇక ఈ సినిమా ఇప్పటికీ టీవీలో వచ్చిన కూడా టీవీలకు అతుక్కుపోతుంటారు ప్రేక్షకులు. అంతలా తెలుగు ప్రేక్షకులందరిని అలరిస్తూ ఉంటుంది దూకుడు సినిమా. సినిమాలో మహేష్ బాబు సరసన సమంత నటించింది. ఈ సినిమా స్టోరీ చేయడానికి అటు దర్శకుడు శ్రీను వైట్ల ఎంతో కష్టపడ్డాడట. ముందుగా మహేష్ ని కలిసి మీతో ఒక బ్లాక్ బస్టర్ సినిమా తీస్తాను అని చెప్పడంతో మహేష్ కూడా పర్మిషన్ ఇచ్చేశాడట. కానీ అప్పటికి కథ రెడీ కాలేదట.



 ఈ క్రమంలోనే శ్రీను వైట్ల తన రైటర్స్ అందరితో కలిసి కూర్చొని ఒక కథ రెడీ చేసిన తర్వాత  అది నచ్చక పోవడంతో అది డ్రాపయ్యాడట.  చివరికి ఒక ఎమ్మెల్యే జీవిత జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని ఒక సినిమా తెరకెక్కిస్తే ఎలా ఉంటుంది అని భావించి ఎమ్మెల్యే పి జనార్దన్ రెడ్డి లాంటి ఒక ఎమ్మెల్యే పాత్రను సృష్టించి ఇక ఈ సినిమాని తెరకెక్కించారట. ఈ సినిమాలో తండ్రి పాత్రకు కొడుకు ఎమ్మెల్యే కావాలని ఉంటుంది. కానీ కొడుకు పోలీస్ అవుతాడు. చివరికి రియాల్టీ షో ప్లాన్ చేసి తర్వాత తండ్రిని బతికించుకోవడానికి  హీరో మహేష్ బాబు ఎమ్మెల్యే లాగా నటిస్తాడు. ఇది ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడంతో సూపర్ డూపర్ హిట్ సాధించింది. ఇక ఈ సినిమా ఏకంగా వంద కోట్లకు పైగా వసూళ్లను రాబట్టడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: