నేషనల్ క్రాష్ రష్మిక మందన నాగ శౌర్య హీరోగా వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కిన చలో సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది, మొదటి సినిమాతోనే బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకున్న ఈ ముద్దుగుమ్మ ఈ సినిమాలో తన నటన ద్వారా, అందచందాల ద్వారా కూడా అనేకమంది తెలు గు ప్రేక్షకుల మనసు దోచుకుంది. ఇలా మొదటి సినిమాతోనే టాలీవుడ్ లో మంచి క్రేజ్ ను సంపాదించుకున్న ఈ హీరోయిన్ తెలుగులో క్రేజీ సిని మా ఆఫర్లు కొట్టేసింది. అందు లో భాగంగా గీత గోవిందం, డియర్ కామ్రేడ్, సరిలేరు నీకెవ్వరు వంటి క్రేజీ సినిమాల్లో నటించిన రష్మిక మందన అతి తక్కువ కాలంలోనే టాలీవుడ్ స్టార్ హీరోయిన్ ల సరసన చేరిపోయింది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం రష్మిక మందన అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పుష్ప సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది.

సినిమా తో పాటు శర్వానంద్ హీరోగా తెరకెక్కుతున్న ఆడవాళ్లు మీకు జోహార్లు అనే సినిమాలో కూడా రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తోంది, ఇలా వరుస సినిమాలతో ఫుల్ బిజీగా సమయాన్ని గడుపుతున్న రష్మిక మందన సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. తన మీద వచ్చే కామెంట్ లను కూడా ఎంతో స్పోర్టివ్ గా తీసుకునే రష్మిక మందన  కు మరొక సారి ఇలాంటి అనుభవమే ఎదురైంది. ఒక నెటిజన్ రష్మిక మందన ను 'ఎలా పెట్టుకుంటారురా దీన్ని' అంటూ కామెంట్ చేశాడు  ఇలా నెటిజన్ చేసిన కామెంట్ కు రష్మిక మందన చాలా కూల్ గా సమాధానం ఇచ్చింది. నా యాక్టిం గ్ కోసం అంటూ రష్మిక మందన చాలా సున్నితంగా సమాధానం ఇచ్చి తన మీద ద్వేషాన్ని చూపించిన వారి పై కూడా రష్మిక మందన ప్రేమను కురిపించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: