ఒక పాట తో సినిమాపై భారీ అంచనాలను పెంచడం బహుశా ఒక్క తమన్ కే సాధ్యం కావచ్చు. ఇటీవల కాలంలో తమన్ రేంజ్ లో సంగీతాన్ని సమకూర్చి సంగీత దర్శకుడు టాలీవుడ్ లో లేకపోవడం ఆయనకు గొప్ప కీర్తి ప్రతిష్టలు తెచ్చి పెడుతోంది అని చెప్పవచ్చు. అల వైకుంఠపురం లో సినిమా తర్వాత తమన్ రేంజ్ ఒక్కసారిగా పెరిగి పోయింది. ఆ సినిమాలోని అన్ని పాటలు కూడా సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే.

దాంతో పాటు యూట్యూబ్ లో టాలీవుడ్ ఎప్పుడు చూడని రికార్డులను సృష్టించడం ఒక్కసారిగా తెలుగు సినిమా సంగీతం పై దేశం మొత్తం ఆసక్తి కలిగేలా చేస్తుంది. కేవలం పెద్ద సినిమాలను మాత్రమే ఒప్పుకుంటున్న తమన్ తన కెరీర్లో ఎప్పుడూ లేనంత బిజీగా ఇప్పుడు ఉన్నాడు అని చెప్పవచ్చు. ఇక ప్రస్తుతం ఆయన సంగీతం అందిస్తున్న క్రేజీ చిత్రాలలో ఒకటి భీమ్లా నాయక్ సినిమా. పవన్ కళ్యాణ్ మరియు రానా హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి త్రివిక్రమ్ రచయితగా వ్యవహరిస్తుండగా సాగర్ చంద్ర దర్శకత్వం వహిస్తున్నాడు.

ఈ సినిమాలో ఇప్పటికే రెండు పాటలు విడుదల కాగా ఈ పాటలతో సినిమా రేంజ్  ఒక్కసారిగా పెంచాయని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ సినిమా యొక్క టైటిల్ టైటిల్ సాంగ్ భీమ్లా నాయక్ అంటూ సాగే పాటకు విశేషమైన ఆదరణ లభిస్తోంది. ప్రస్తుతం మిలియన్ల వ్యూస్ తో యూట్యూబ్ లో టాప్ లో ఉన్న ఈ పాటను ప్రముఖ కళాకారుడు కిన్నెర మొగులయ్య ఆలపించగా పాట లోని మిగతా భాగాన్ని రామ్ మిరియాల మరియు పృథ్వి చంద్ర లు ఆలపించారు. ఏదేమైనా ఈ సినిమా విడుదల కాకముందే సూపర్ హిట్ టాక్ తెచ్చుకునే విధంగా ఈ సినిమాకు పాటలు అందించిన తమన్ నిజంగా టాలీవుడ్ నెంబర్ వన్ సంగీత దర్శకుడు అని చెప్పాలి. 




మరింత సమాచారం తెలుసుకోండి: