టాలీవుడ్ సినిమా పరిశ్రమలో బావ బామ్మర్దులుగా ఉన్న
అల్లు అరవింద్ మరియు
మెగాస్టార్ చిరంజీవి ల మధ్య ఉన్న అనుబంధం అందరికీ తెలిసిందే.
మెగాస్టార్ ఇంత ఎత్తు ఎదగడానికి
అల్లు అరవింద్ తండ్రి
అల్లు రామలింగయ్య కారణమని ఓ వర్గం చెబుతున్న మాట. లేదు ఆయన స్వయంకృషితోనే ఇంతగా ఎదిగారు అన్నది అందరూ చెబుతున్న మాట. ఏదేమైనా కూడా అల్లు వారి కుటుంబంతో
మెగాస్టార్ చిరంజీవి ఎంతో సన్నిహితంగా మెలిగి వారితో ఎంతో ఆప్యాయంగా కూడా ఉంటారు.
అంతే కాదు ఈ ఇరువురు తమ బిజినెస్ పనులను
సినిమా పనులను ఒకరికొకరు చెప్పుకుంటూ సలహాలు తీసుకుంటూ ముందుకు వెళుతూ ఉంటారు. చిరు రాజకీయాల సమయంలో కూడా
చిరంజీవి సలహాలను
అల్లు అరవింద్ వద్ద తీసుకుని ముందుకు వెళ్లారు. మొదటి నుంచి ఈ ఇద్దరు కూడా మంచి
స్నేహ బంధాన్ని కొనసాగిస్తూ ఇప్పటి వరకు ఇండస్ట్రీలో కొనసాగుతూ వచ్చారు. అయితే ప్రస్తుతం చిరంజీవికి వ్యతిరేకంగా అనుకుంటున్న చర్యలను
అల్లు అరవింద్ చేయడం ఇప్పుడు
టాలీవుడ్ లో కొంత చర్చనీయాంశంగా మారింది.
అదేమిటంటే ఇండస్ట్రీలో చిరంజీవికి శత్రువులుగా భావించే కొంతమందిని
అల్లు అరవింద్ కలుపుకొని పోవడం ఇప్పుడు మెగా అభిమానులను కొంత అయోమయానికి గురిచేస్తోంది.
బాలకృష్ణ చిరంజీవి మధ్య మైత్రి బాగానే ఉన్నా రాజకీయంగా వీరిద్దరి మధ్య అభిప్రాయభేదాలు వచ్చాయి. అప్పటినుంచి ఎడమొహం పెడమొహంగా ఉంటున్నారు. అలాంటి బాలకృష్ణతో కలిసి ఆయన ఆహా సంస్థ లో ఓ షో చేస్తున్నారు. అలాగే ఇటీవల ఎన్నికల సందర్భంగా మోహన్ బాబు
చిరంజీవి మధ్య వైరం బయటపడిన విషయం తెలిసిందే. ఆయన తో కలిసి
అల్లు అరవింద్ చర్చలు జరపడం ఆశ్చర్యం గా ఉంది. అయితే బావ వారికి దూరంగా ఉంటే బామ్మర్ది మాత్రం వారి అందరినీ కలుపుకు పోవడం దేనికి సంకేతం ఇంకా తెలియడం లేదు.