
వరుణ్ తేజ్ ప్రస్తుతం కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో గని అనే బాక్సింగ్ నేపథ్యంలో ని సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. మొదటి నుంచి మంచి అంచనాలు ఉన్న ఈ సినిమా లోని టైటిల్ సాంగ్ విడుదలయ్యి మంచి హిట్ అయ్యింది. అలా మన టాలీవుడ్ లో కొన్ని ఎవర్ గ్రీన్ సాంగ్స్ ఉన్నాయి. ఆ సాంగ్స్ సరసన ఇది నిలిచింది. ప్రతి ఒక్క హీరో కెరీర్ లోనూ కొన్ని పాటలు ప్రేక్షకులను అభిమానులను ఎంతగానో అలరిస్తూ ఉంటాయి. అలా గని యాంతెం సాంగ్ విడుదల అయ్యి వరుణ్ తేజ్ కి ఆయన కెరీర్ లో ఈ పాట ఎప్పటికీ నిలిచిపోతుంది అని చెప్పవచ్చు.
నిన్న సాయంత్రం విడుదలైన ఈ పాటకు యూట్యూబ్ లో భారీ రెస్పాన్స్ వస్తుంది. తమన్ సంగీతం సమకూర్చిన ఈ పాట చాలా వెరైటీగా ప్రేక్షకులకు నచ్చే విధంగా ఉందని చెబుతున్నారు. వరుసగా రెండు హ్యాట్రిక్ చిత్రాలను విజయాలను తన ఖాతాలో వేసుకున్న వరుణ్ తేజ్ ఈ సినిమా తో సైతం మంచి విజయం సాధించి ముందుకు దూసుకుపోవాలని భావిస్తున్నారు. ఇకపోతే ఆయన చేస్తున్న ఈ సినిమాను మెగా హీరో లైనా పవన్ అలాగే రామ్ చరణ్ వంటి హీరోల సినిమాలతో పోలిస్తూ ఉన్నారు.
పవన్ కళ్యాణ్ యంగ్ హీరో గా ఉన్నప్పుడు ఆయన కెరీర్లో తమ్ముడు సినిమా బాక్సింగ్ నేపథ్యంలోనే తెరకెక్కి ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికి తెలిసిందే. ఆ చిత్రంలో పవన్ కళ్యాణ్ నటించిన తీరు చూపించిన స్టైల్ కి గాను ఆ సినిమా సూపర్ హిట్ అయిందని చెప్పవచ్చు. దానికి తోడు కథ కథనం కూడా బాగా ఉండడంతో ఆ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. రామ్ చరణ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన ధ్రువ సినిమా ను కూడా వరుణ్ తేజ్ గని తో పోలుస్తున్నారు. ఆ చిత్రంలో టైటిల్ సాంగ్ ఎలా అయితే హిట్ అయిందో ఆ పాట లాగానే కూడ ఈ పాట తప్పకుండా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుందని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు.
అల్లు అరవింద్ సమర్పణలో అల్లు బాబీ నిర్మిస్తున్న ఈ సినిమా డిసెంబర్ 3వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుండగా ఈ చిత్రం ఏ రేంజ్ విజయం సాధిస్తుందో చూడాలి. ఇకపోతే వరుణ్ తేజ్ ఈ సినిమా తర్వాత వెంకీ కుడుముల దర్శకత్వంలో ఓ చిత్రం చేయనున్నాడని వార్తలు బాగా వస్తున్నాయి.