
విశాల్ దద్లానీ తన ఫోటోతో కూడిన పోస్ట్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. అందులో అతను బ్లాక్ కలర్ టీ షర్ట్ వేసుకుని కూర్చున్నాడు ఆయన టీ షర్ట్ మీద భగత్ సింగ్ చిత్రం ఉంది. "మన స్వాతంత్య్రం 'భిక్ష' అని చెప్పిన మహిళను గుర్తు చేసుకోండి. నా టీ షర్ట్ మీద ఉన్న వ్యక్తి షహీద్ సర్దార్ భగత్ సింగ్, నాస్తికుడు, కవి తత్వవేత్త, స్వాతంత్య్ర సమరయోధుడు, భారతదేశపు కుమారుడు మరియు ఒక రైతు కుమారుడు. ఆయన 23 సంవత్సరాల వయస్సులో మన స్వాతంత్య్రం కోసం, భారతదేశ స్వాతంత్య్రం కోసం తన జీవితాన్ని అర్పించాడు. అతని పెదవులపై చిరునవ్వుతో పాట పాడుతూ ఉరికి సిద్ధమయ్యాడు. ఆయన గురించి సుఖ్‌దేవ్, రాజ్‌గురు, అష్ఫాఖుల్లా వంటి నమస్కరించడానికి, అడుక్కోవడానికి నిరాకరించిన అనేక వేల మంది గురించి ఆమెకు గుర్తు చేయండి. ఆమెకు మర్యాదపూర్వకంగా, కానీ గట్టిగా గుర్తు చేయండి. అప్పుడు ఆమె మళ్ళీ మరచిపోయే ధైర్యం చేయదు.
సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతుంటే కంగనా మాత్రం సమర్థిస్తూ తన ఇన్‌స్టాగ్రామ్ లో సుదీర్ఘమైన కథనాన్ని పోస్ట్ చేసింది. అయినప్పటికీ చాలా చోట్ల ఆమెపై ఎఫ్‌ఐఆర్ కూడా నమోదైంది. దేశ ద్రోహం కింద కేసులు పెట్టాలని రాజకీయ పార్టీలు అంటున్నాయి.