సంక్రాంతి సీజన్ కు టాలీవుడ్ సినిమా పరిశ్రమ నుంచి పెద్ద పెద్ద సినిమాలు విడుదల అవుతున్న విషయం తెలిసిందే. ఆ సీజన్ లో గతంలో ఎప్పుడూ లేని విధంగా భారీ చిత్రాలు విడుదల కాబోతుండగా దానికి మించిన విధంగా టాలీవుడ్ నుంచి చిత్రాలు డిసెంబర్ లో విడుదల కాబోతు ఉండగా అది ఇప్పుడు టాలీవుడ్ లో ఎంతో చర్చనీయాంశంగా మారింది.  డిసెంబర్ లో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఐదు క్రేజీ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఆ విధంగా తెలుగు లో డిసెంబర్ లో విడుదల కాబోయే సినిమాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

డిసెంబర్ 2వ తేదీన బాలకృష్ణ హీరోగా నటిస్తున్న అఖండ సినిమా విడుదల కాబోతోంది. బాలకృష్ణ బోయపాటి శ్రీను కలయికలో వస్తున్న మూడో సినిమా కావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టు ట్రైలర్ పాటలు ఇప్పటివరకు వచ్చిన అప్ డేట్లు ఉండగా ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇక డిసెంబర్ 4వ తేదీన సత్యదేవ్ హీరోగా నటించిన స్కైలాబ్ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. వెరైటీ కథనంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా పై కూడా భారీ అంచనాలే ఉన్నాయి.

ఇక డిసెంబర్ 15వ తేదీన కీర్తి సురేష్ జగపతిబాబు ప్రధాన పాత్రల్లో నటించిన గుడ్ లక్ సఖి ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అలాగే ఆ సినిమా వచ్చిన వారం రోజుల తర్వాత దేశం మొత్తం ఎంతగానో ఎదురు చూస్తున్న పుష్ప సినిమా డిసెంబర్ 17వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అలాగే డిసెంబర్ 24వ తేదీన గని, శ్యామ్ సింగ రాయ్  చిత్రాలు కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.  ఈ విధంగా డిసెంబర్ నెలలో 5 క్రేజీ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వస్తూ అందరినీ ఎంతగానో ఆకర్షిస్తుంది. మొత్తం మీద సంక్రాంతి సీజన్ కంటే ముందే డిసెంబర్ లో తెలుగు సినిమాలు సంక్రాంతి మొదలుకానుంది

మరింత సమాచారం తెలుసుకోండి: