సాయి  ధరమ్ తేజ్ హీరో గా తెరకెక్కిన సినిమా రిపబ్లిక్, ఈ సినిమాకు వెన్నెల, ప్రస్థానం, ఆటో నగర్ సూర్య లాంటి విలక్షణ మైన సినిమా లను తెరకెక్కించిన దర్శకుడు దేవా కట్టా దర్శకత్వం వహించాడు. ఈ సినిమా లో ఐశ్వర్య రాజేష్ హీరోయిన్ గా నటించింది. సాయి ధరమ్ తేజ్ కి రోడ్ యాక్సిడెంట్ జరిగి హాస్పటల్ లో ఉన్న సమయం లోనే ఈ సినిమాను థియేటర్ లలో విడుదల అయ్యింది. జెబి ఎంటర్టైన్మెంట్స్ మరియు జీ స్టూడియోస్ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మించారు. మొదటి నుండి ఎన్నో అంచనాలు ఉన్న ఈ సినిమా ఒక అవినీతి పరులైన రాజకీయ నాయకురా లుకు ఒక నిజాయితీ పరుడైన కలెక్టర్ కు మధ్య సాగే కథ గా తెరకెక్కింది. అవినీతి కలిగిన రాజకీయ నాయకురా లుకు బుద్ధి చెప్పడానికి కలెక్టర్ ఎలాంటి పనులు చేశాడు, చివరిగా ఏమి జరిగింది అనే కథాంశం తో ఈ సినిమాను దర్శకుడు దేవా కట్ట తెరకెక్కించాడు.

సినిమా లో అవినీతి పరులైన రాజకీయ నాయకు రాలు పాత్ర లో రమ్యకృష్ణ నటించగా ,  నిజాయితీ పరుడైన కలెక్టర్ పాత్ర లో సాయి ధరమ్ తేజ్ నటించాడు. మంచి అంచనా లతో థియేటర్ లలో విడుదలైన ఈ సినిమా పర్వాలేదు అనుకునే రేంజ్ లో కలెక్షన్ లు సాధించింది, కాక పోతే ఈ సినిమా విమర్శకుల నుండి మాత్రం మంచి ప్రశంసలు దక్కించుకుంది. ఇలా థియేటర్ ల దగ్గర పర్వాలేదు అనుకునే రేంజ్ లో కలెక్షన్ లు తెచ్చుకున్న ఈ సినిమా నవంబర్ 26 వ తేదీ నుండి జీ 5 ఓటిటి లో స్ట్రీమింగ్ కావడానికి రెడీ గా ఉంది. థియేటర్ లలో ఈ సినిమాను చూడని వారందరూ ఎప్పుడు ఓటిటి లో టెలికాస్ట్ అవుతుందా.? ఎప్పుడు చూద్దామా అని చాలా ఆసక్తి తో ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: