సినిమా అంటే కేవలం ఒక లవ్ స్టోరీ , ఫ్యామిలీ డ్రామా, లాంటివి కాకుండా సమాజా భివృద్ధి, సామాజిక విలువలను చెప్పే విధంగా కూడా ఉంటాయని నిరూపించిన చాలా సినిమాలలో శివాజీ కూడా ఒకటని చెప్పవచ్చు .శంకర్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజనీకాంత్ మరియు శ్రియ జంటగా, ఏ. వి.ఎం ప్రొడక్షన్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించింది. ఈ సినిమాకు ఏ ఆర్ రెహమాన్ సంగీత దర్శకుడిగా చేశారు. అప్పట్లోనే ఈ సినిమాను 69 కోట్లు పెట్టి నిర్మించారు. 136 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టి బాక్స్ ఆఫీస్ రికార్డ్ క్రియేట్ చేసిన సినిమా.

భారతదేశం నుండి అమెరికా వెళ్లి బాగా సంపాదించి కొన్ని సంవత్సరాల తర్వాత తిరిగి భారతదేశానికి వచ్చినప్పుడు తను వెళ్లకముందు ఇప్పుడు ఒకేలా ఉన్న పరిస్థితులను చూసి తన దేశానికి ఏదైనా చేయాలనే ఆశతో సంపాదించిన డబ్బుతో తనే సొంతంగా స్కూల్లో ఆసుపత్రులు రోడ్డు వేయించాలని అనుకుంటాడు కానీ  ఇక్కడ ఉన్న కొందరు రాజకీయ నాయకులు వ్యాపార వేత్తలు దానివల్ల వారికి నష్టం కలుగుతుందని దాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. ఈవిధంగా విభిన్న కథా నేపథ్యంలో  తెరకెక్కిన ఈ చిత్రం తమిళ్ , తెలుగులో మంచి విజయాన్ని సాధించింది. ఆ తర్వాత 2010 లో ఈ సినిమాను హిందీలో కూడా విడుదల చేశారు.


అప్పట్లో ఈ సినిమా ఇన్స్పిరేషన్తో చాలామంది వాళ్ళ  సొంత గ్రామాల్లో పాఠశాలలు,హాస్పిటల్, రోడ్లు, మంచినీటి సదుపాయాలు కూడా చేశారు. హీరో రజినీకాంత్ గారు కూడా  తనకు ఎంతగానో గుర్తింపు తెచ్చిన తమిళ ప్రజలకు మాత్రమే కాకుండా, తను పుట్టినటువంటి కర్ణాటక రాష్ట్రంలో కూడా తన సొంత డబ్బుతో ఖర్చుపెట్టి చాలా మంచి పనులు చేశారు. అందుకు నిదర్శనంగా భారతీయ ప్రభుత్వం ఆయనకు 2016 సంవత్సరంలో పద్మవిభూషన్ పురస్కారాన్ని, మరియు 2019 వ సంవత్సరం లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పొందారు.

మరింత సమాచారం తెలుసుకోండి: