తెలుగు ఇండస్ట్రీ లోనే సినీ గేయ రచయితలలో పేరు పొందిన వారిలో సిరివెన్నెల సీతారామ శాస్త్రి కూడా ఒకరు. ఇక ఈయన నిన్నటి రోజున తీవ్ర అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. దీంతో హుటాహుటిగా ఆయనను హైదరాబాదులో ఉండేటువంటి కిమ్స్ హాస్పిటల్ లోకి చేర్చరు కుటుంబ సభ్యులు. ఈయనకు మూడు రోజుల క్రితమే అనారోగ్య సమస్యతో బాధపడుతున్నట్లు గా సమాచారం. ప్రస్తుతం వైద్యులు ఈయనకు వైద్యం అందిస్తున్నారు. ఈ విషయం అభిమానులకు తెలియగానే కాస్త ఆందోళన చెందుతున్నారు.

ఇక వీరితో పాటే సినీ ఇండస్ట్రీ లోనే ఉంది కొంత మంది ప్రముఖులు కూడా ఈయన త్వరగా కోలుకోవాలని భావిస్తున్నారు. ఇక సీతరామశాస్త్రి విషయానికి వస్తే . ఈయన ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం జిల్లాలో ఉండే అనకాపల్లి లో జన్మించారు. ఈయన 1955 మే 20 వ తేదీన జన్మించారు. తండ్రి శ్రీయోగి, తల్లి శ్రీమతి సుబ్బలక్ష్మి అమ్మ కి జన్మించారు. సిరివెన్నెల సీతారామశాస్త్రి MA చదువుకుంటున్న అప్పుడే సినిమా అవకాశాలు రావడంతో సినీ ఇండస్ట్రీ వైపు అడుగులు వేశాడు.

మొదటిగా డైరెక్టర్ విశ్వనాధ్ తెరకెక్కించిన"సిరివెన్నెల" అనే సినిమా  కీ  పాటలు రాసే అవకాశం దక్కించుకున్నాడు సిరివెన్నెల సీతారామశాస్త్రి. ఈ సినిమాలో మొత్తం పాటలను ఈయనే రాయడం విశేషం. అవకాశం రావడంతో  తన అనుభవాన్ని అంతా ఉపయోగించుకొని తన టాలెంట్ నిరూపించుకున్నడు సీతారామశాస్త్రి. ఇక ఈ మూవీతోనే ఈయన పేరు సిరివెన్నెల సీతారామ శాస్త్రి గా మారిపోయింది.

ఎన్నో సంవత్సరాల నుండి తెలుగు సినిమాలకు పాటలు పాడి, రచయితగా కూడా కొనసాగించారు. ఇప్పటివరకు సీతారామశాస్త్రి 3000 లకు పైగా పాటలు రాసినట్లుగా తెలుస్తోంది. ఇక ఈయన రాసిన పాటలు దాదాపుగా అన్ని హిట్ సాంగ్స్ అని చెప్పుకోవచ్చు.ఇక 2019 వ సంవత్సరంలో పద్మశ్రీని కూడా అందుకున్నారు. ఇక ఈయన కెరీర్లో ఎన్నో నంది అవార్డులను, ఫిలింఫేర్ అవార్డులను కూడా దక్కించుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: