సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ గా నెట్టుకురావలంటే చాలా కష్ట పడాలి. ఎన్నో త్యాగాలు చేయాలి. పోనీ అలా చేసిన హిట్ పడుతుందా అంటే అదీ లేదు. టాలెంట్, కష్టం తో పాటు..అదృష్టం కూడా ఉండాలి. అప్పుడే ఇండస్ట్రీలో హీరోయిన్ గా నెట్టుకురాగలరు. అలా అదృష్టాని బ్యాక్ పాకెట్ లో పెట్టుకుని చేసిన మొదటి సినిమాతోనే హిట్ కొట్టిన ముద్దుగుమ్మలు ఎంతోమంది ఉన్నారు. వాళ్లల్లో పాయల్ రాజ్‌పుత్ కూడా ఒకరు. rx100 అనే సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన అమ్మడు ఒక్క సినిమాతో ఓవర్‌నైట్ స్టార్‌ గా మారిపోయింది. ఈ సినిమాలో హీరో కార్తికేయ తో హాట్ రొమాన్స్ లు చేస్తు యువతకు పిచ్చెక్కించింది.

 ఆ సినిమాలో అమ్మడు ది నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్ర అయినా  లవర్ ని మోసం చేసిన అమ్మాయి గా పాయల్ రాజ్‌పుత్ పర్ ఫామెన్స్ అద్దరగొట్టేసిందనే చెప్పాలి. ఇక ఆ సినిమా హిట్ అవ్వడంతో బడా డైరెక్టర్స్ కళ్లు అమ్మడు మీద పడ్డాయి. దీంతో వెంకటేష్, రవి తేజ లాంటి స్టార్స్ పక్కన నటించే అవకాశం అందుకుంది.  ఈ క్రమంలోనే వెంకీమామ, డిస్కో రాజా అనే సినిమాలు చేసిన  పాయల్ పెద్దగా సక్సెస్ అందుకోలేకపోయింది. బాక్స్ ఆఫిస్ వద్ద ఈ సినిమాలు భారీ డిజాస్టర్ టాక్ ను సొంతం చేసుకోవడమే కాకుండా బిగ్గెస్ట్ ఫ్లాప్ సినిమాలుగా నిలిచాయి.

ఒక్క సినిమాతోనే కుర్రకారు గుండెల్ని కొల్లగొట్టేసిన పాయల్ రాజ్ పుత్ కి వరుస ఫ్లాప్ సినిమాలు పడడంతో అమ్మడు కెరీర్ డిజాస్టర్ గా మారింది. ఇక దీంతో డిజిటల్ పైన దృష్టి పెట్టిన పాయల్ పాప ఓటీటీలో సినిమాలు చేస్తూ మెప్పిస్తుంది . రీసెంట్ గా ఆహా కోసం త్రి రోజెస్ అనే వెబ్ సిరీస్ లో హాట్ అందాలు వలకబోస్తూ  పాయల్ పిచ్చెక్కించ్చింది. ఇక చాలా కాలం తరువత మళ్లీ ఈ సిరీస్ తో పాయల్ హిట్ అందుకుంది. దీంతో అమ్మడుకి మళ్లి అవకాశాలు వస్తున్నాయి. రీసెంట్ గా పాయల్ ఓ  కన్నడ సినిమా కు సైన్ చేసిన్నట్లు తెలుస్తుంది. ధనంజయ కీలక  పాత్రలో తెరకెక్కుతున్న జయరాజ్ బయోపిక్ హెడ్ బుష్లో పాయల్ ఛాన్స్ కొట్టేసింది. ఈ సినిమాలో పాయల్ ఓ కీలక పాత్రను పోషిస్తున్నట్లు మేకర్స్ తెలిపారు. ఈ సినిమాలో క్యాబరే డ్యాన్సర్ గా మనల్ని మరోసారి తన అందాలతో కవ్వించబోతుంది పాయల్. మరి చూడాలి ఈ సినిమా పాయల్ కు ఎలాంటి సక్సెస్ ను తెచ్చిపెడుతుందో..?

మరింత సమాచారం తెలుసుకోండి: