హాట్ బ్యూటీ ప్రియాంక జవాల్కర్ విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన టాక్సీ వాలా సినిమా తో తెలుగు ప్రేక్షకులను పలకరించింది, ఈ సినిమా మంచి విజయం సాధించడం తో పాటు ఈ ముద్దు గుమ్మ అంద చందాలకు, నటన కు కూడా తెలుగు ప్రేక్షకుల నుండి మంచి మార్కులు పడటంతో ఈ ముద్దు గుమ్మ కు తెలుగులో క్రేజీ సినిమా అవకాశాలు దక్కాయి, అందులో భాగంగా సత్యదేవ్ హీరో గా తెరకెక్కిన తిమ్మరుసు, కిరణ్ అబ్బవరం హీరోగా తెరకెక్కిన ఎస్ ఆర్ కళ్యాణమండపం సినిమా లతో తెలుగు ఇండస్ట్రీ లో ఈ హాట్ బ్యూటీ ఫుల్ క్రేజ్ ని సంపాదించుకుంది.

ఇలా ఇప్పటికే టాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న ఈ హాట్ బ్యూటీ ప్రస్తుతం గమనం సినిమా లో నటిస్తోంది, ఈ సినిమా తో సంజన రావు దర్శకురాలిగా పరిచయం కాబోతుంది. శ్రియా సరన్, శివ కందుకూరి, ప్రియాంక జవాల్కర్, నిత్యా మీనన్సినిమా లో ప్రధాన పాత్రలు పోషించారు, క్రియ ఫిల్మ్ కార్ప్, కలి ప్రొడక్షన్స్ బ్యానర్ లపై రమేష్ కురుటూరి, వెంకీ పుష్పదపు, జ్ఞానశేఖర్ వి.ఎస్ సంయుక్తం గా ఈ సినిమాను తెరకెక్కించారు. గమనం సినిమా డిసెంబర్ 10 వ తేదీన విడుదల చేయబోతున్నారు, ఈ సందర్భం గా మీడియా తో మాట్లాడిన ప్రియాంక జవాల్కర్ కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియజేసింది. నిర్మాత జ్ఞానశేఖర్ గారు మొదట గా ఈ మూవీ కోసం నన్ను అడిగారు, ముస్లిం అమ్మాయి పాత్ర కావడం తో బుర్ఖా వేసి నాకు టెస్ట్ లుక్ చేశారు. ఆ తర్వాతే ఓకే చేశారు అని ప్రియాంక జావల్కర్ తెలియజేసింది. ఇందులో భాగంగా ప్రియాంక జవాల్కర్ మాట్లాడుతూ.. మామూలుగా నన్ను చూస్తే అందరూ కూడా కమర్షియల్ మూవీ లకు పనికస్తాను అని, తెల్లగా ఉన్నావ్ విలేజ్ అమ్మాయి పాత్రలు చేయవద్దు  అంటారు అని ప్రియాంక జవాల్కర్ తెలియజేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: