ఒకప్పుడు ఎంతో మంది హీరోయిన్లు ఏదైనా సినిమాలో నటించాలంటే ఎన్నో కండిషన్ లు పెట్టే వారు. అంతే కాకుండా ఏదైనా ఐటెం సాంగ్ లో నటించాలంటే కూడా చాలా మొహమాటం పడేవారు. కానీ ప్రస్తుతం ఉన్న హీరోయిన్లు మొహమాటం లేకుండా రెమ్యూనరేషన్ తీసుకుంటూ వారికి నచ్చిన పని చేసుకుంటూ వెళుతున్నారు. కానీ ఒకప్పుడు ఇలా ఐటెం సాంగ్ లో నటిస్తే వారి సినీ కెరీర్ అయిపోయినట్లుగా ఉండేది. కానీ ప్రస్తుతం ఇలా ఏదో ఒక సినిమా లో తళుక్కున మెరిస్తే ఇంకా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ వస్తుందని ఇప్పుడు హీరోయిన్ల నమ్మకం. తాజాగా ఇలాగే ఇప్పుడు జాతిరత్నాలు సినిమా హీరోయిన్ చిట్టి కూడా బంగార్రాజు సినిమాలో కనిపించనుంది. వాటి గురించి చూద్దాం.


చిట్టి బంగార్రాజు సినిమా లో ఒక స్పెషల్ సాంగ్ లో చేయడానికి ఒప్పుకున్నది. మరొక పక్క కూడా హీరోయిన్ గా  కొన్ని సినిమాల్లో నటిస్తోంది. ఇక సమంత కూడా పుష్ప మూవీ లో ఒక స్పెషల్ సాంగ్ లో నటిస్తోందంటే అందరూ ఆశ్చర్యపోయారు. అయితే ముందుగా ఆ పాటకి శృతిహాసన్ , తమన్నా ని అనుకున్నారట కానీ వారు కొన్ని సినిమాలకి కమిట్మెంట్ కావడంతో.. ఈ సినిమాను వదులుకున్నట్లు సమాచారం. కానీ చిట్టి మాత్రం ఏ మాత్రం ఆలోచించకుండా వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటోంది.

ఫరీయా అబ్దుల్లా మొదటగా జాతి రత్నాలు వంటి చిన్న సినిమాతో ఇమే బాగా పాపులర్ అయింది. ఆ తర్వాత అఖిల్ నటించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మూవీ లో ఒక కీలక పాత్రలో కనిపించింది. అయితే అలా కొడుకు తో కలిసి నటించిన ఫరియా అబ్దుల్లా ప్రస్తుతం బంగార్రాజు మూవీ లో కూడా చాన్స్ కొట్టేసింది. ఇందులో నాగచైతన్య కూడా  నటిస్తున్నాడు. ఇక బంగార్రాజు లోని కొన్ని స్పెషల్ సాంగ్ లో చేస్తున్నటువంటి ఫోటోలు బాగా వైరల్ గా మారుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: