సురేఖ వాణి పేరు గురించి మనం ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు..40 వయసులో కూడా సోషల్ మీడియాలో బాగానే హవా కొనసాగిస్తోంది. ఇక ఈమె బాటలోనే తన కూతురు సుప్రీత కూడా ప్రయాణిస్తోంది. ఇక తల్లి కూతుర్లు ఇద్దరు ఎప్పుడు ఏదో విధంగా బాగా పాపులర్ అవుతూ ఉంటారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో పెట్టే కొన్ని పోస్టులు, వాటి నుంచి వచ్చే నెటిజన్ల కామెంట్ల వల్ల అయినా పాపులర్ అవుతూ ఉంటారు. ఇక వీరిద్దరి ఫ్యాన్ ఫాలోయింగ్ చూస్తే హీరోయిన్ రేంజ్ లో ఉంటుంది. అయితే తన తండ్రి మరణానికి గల కారణం ఏంటో తెలియజెప్పింది సుప్రీత. ఇప్పుడు వాటి గురించి చూద్దాం.


సోషల్ మీడియాలో ఒక నెటిజన్ తో తమ తండ్రి సురేష్ తేజ మరణం గురించి చెబుతూ ఎమోషనల్ అయ్యింది. తన తండ్రి ఎలా మరణించారు అనే విషయం తను స్వయంగా తెలియజేసింది. తన తండ్రి సురేష్ తేజ టీవీ డైరెక్టర్ అని.. నాకు తన తండ్రికి చాలా అనుబంధం ఉండేది అని తెలిపింది. ఇక తన తండ్రితో కలిసి బాగా అల్లరి చేసేదాన్ని.. ఆమె తండ్రిని గుర్తు చేసుకుని ఎమోషనల్ అయ్యింది. తండ్రి మరణించే ముందు  ఏం జరిగిందో అనే విషయాన్ని కూడా బయట పెట్టింది. సురేష్ తేజపు ఎక్కువగా నడిచే అలవాటు ఉండేదట..



అలా నడుస్తున్నప్పుడే ఒక కాలు చాలా నొప్పి రావడంతో. డాక్టర్లను సంప్రదించగా.. కాళ్ల కి వైరస్ సోకిందని తెలియజేశారట.. అంతేకాకుండా కాళ్ల వేల వరకు తీసేస్తే.. తగ్గుతుందని తెలియజేశారట. సర్జరీ చేసిన తర్వాత కూడా.. మరొకసారి ఇన్ఫెక్షన్ రావడం, దాంతో హార్ట్ ఎటాక్ రావడం తో 2019 లో తన తండ్రి మరణించారని విషయం తెలిపింది. ఇప్పటికీ తన తండ్రి మరణం ఎంతో తనను వేధిస్తోందని తెలియజేసింది. ఏది ఏమైనా తన తండ్రి లేని లోటు తనకు కనిపిస్తోందని చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: