`ఎవరే అతగాడు` సినిమాతో 2003లో తెలుగు సినీ ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన కేర‌ళ కుట్టి ప్రియ‌మ‌ణి.. ఆ త‌ర్వాత జగపతి బాబుకు జోడీగా `పెళ్ళైనకొత్తలో` మూవీలో న‌టించి మంచి గుర్తింపును ద‌క్కించుకుంది. ఈ సినిమా త‌ర్వాత ప్రియ‌మ‌ణికి వ‌రుస ఆఫ‌ర్లు వ‌చ్చి ప‌డ్డాయి. దాంతో వ‌చ్చిన అవ‌కాశాల‌ను స‌ద్వినియోగం చేసుకుంటూ టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా ముద్ర వేయించుకుంది.

ఇక కెరీర్‌లో మొద‌ట్లో తెలుగింటి అమ్మాయిలా సంస్కార వంతంగా ఉన్న ప్రియమ‌ణి.. ఆ త‌ర్వాత అందాల ఆర‌బోత‌లోనూ ఏ మాత్రం వెన‌క‌డుగు వేయ‌లేదు. అయితే ప్రియ‌మ‌ణి త‌న సినీ కెరీర్‌లో అప్ప‌టి హీరో, ప్ర‌స్తుత స్టార్ విల‌న్ జ‌గ‌ప‌తిబాబుతోనే ఎక్కువ సినిమాలు చేసింది. వీరిద్ద‌రి కాంబోలో పెళ్ళైనకొత్తలో, ప్రవరాఖ్యుడు, సాధ్యం, క్షేత్రం సినిమాలు తెరకెక్కాయి.
ఈ సినిమాల్లో ప్రియ‌మ‌ణి-జ‌గ‌ప‌తి బాబులు అద్భుతంగా కెమిస్ట్రీ పండించి ఆన్ స్క్రీన్ బెస్ట్ క‌పుల్‌గా పేరు తెచ్చుకున్నారు. ఈ క్ర‌మంలోనే వీరిద్ద‌రూ ప్రేమ‌లో ఉన్నారంటూ పుకార్లు తెర‌పైకి వ‌చ్చాయి. పైగా వివిధ ఫంక్షన్ల‌కు మరియు ఈవెంట్ల‌కు కూడా వీరిద్ద‌రూ కలిసి వెళ్లేవారు. దీంతో ప్రియ‌మ‌ణి, జ‌గ‌ప‌తి బాబుల ప్రేమాయ‌ణం పుకార్లకు మ‌రింత బ‌లం చేకూరి సోష‌ల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.

దీంతో జ‌గ‌ప‌తి బాబు, ప్రియ‌మ‌ణిలు క‌లిసి సినిమాలు చేయ‌డం మానేయ‌గా.. వీరిద్ద‌రిపై వ‌చ్చిన పుకార్ల‌కు బ్రేక్ ప‌డింది. ఇకపోతే 2017లో ముస్తఫా రాజ్ అనే వ్య‌క్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది ప్రియ‌మ‌ణి. వివాహం త‌ర్వాత కొన్నాళ్లు సినిమాల‌కు దూరంగా ఉన్న ఆమె.. మ‌ళ్లీ సెకెండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి సినిమాలు, వెబ్ సిరీస్‌ల‌తో పాటు టీవీ షోలు కూడా చేస్తూ క్ష‌ణం తీరిక లేకుండా లైఫ్‌ను లీడ్ చేస్తోంది. మ‌రోవైపు సోష‌ల్ మీడియాలోనూ సూప‌ర్ యాక్టివ్‌గా ఉండే ఈ ముద్దు గుమ్మ ఎప్ప‌టి క‌ప్పుడు హాట్ హాట్ ఫొటో షూట్ల‌తో త‌న ఫాలోవ‌ర్స్‌కు ఫుల్ మీల్స్ పెట్టేస్తుంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: