అయితే కెరీర్లో సూపర్ సక్సెస్ అయిన తమన్నా.. ప్రేమలో మాత్రం విఫలం అవుతూనే ఉంది. ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా మూడు సార్లు తమన్నాకు బ్రేకప్ అయిందట. అందుకే తమన్నాకు ప్రేమ కలిసిరాదని కూడా కొందరు అంటుంటారు. మరి ఇంతకీ తమన్నా ప్రేమించి ఓ ముగ్గురు వ్యక్తులు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం. తమన్నా చదవుకునే రోజుల్లోనే ప్రేమలో పడింది. తన చిన్ననాటి ఫ్రెండ్ అన్నని తమన్నా తొలిసారి ప్రేమించింది. అయితే తన ప్రేమను వ్యక్తపరచక ముందే.. సదరు అబ్బాయి తమన్నాను సిస్టర్ అని పిలిచేశాడట. దాంతో మన మిల్కీ బ్యూటీ ఫస్ట్ లవ్ కాస్త విఫలమైంది.
ఆ తర్వాత సినిమాల్లో రాణిస్తున్న సమయంలో తమన్నా కోలీవుడ్ హీరో కార్తీతో ప్రేమలో పడినట్లు వార్తలు వచ్చాయి. వీరిద్దరూ పెళ్లి కూడా చేసుకుంటారని ప్రచారం జరిగింది. కానీ, కార్తీ తండ్రి వీరి ప్రేమకు అడ్డుపడి కొడుక్కి మరో అమ్మాయిని ఇచ్చి వివాహం జరిపించేశారని టాక్. దాంతో తమన్నా రెండో సారి కూడా ప్రేమలో ఫెయిల్ అయింది.కార్తీతో బ్రేకప్ జరిగిన కొన్నాళ్లకు తమన్నా క్రికెటర్ విరాట్ కోహ్లితో ప్రేమాయణం నడుపుతున్నట్లు జోరుగా కథనాలు వచ్చాయి. కోహ్లీ, తమన్నా డేటింగ్ చేస్తున్నారంటూ వార్తలు పుట్టుకొచ్చాయి. అయితే కారణం ఏంటో తెలీదు గానీ.. కొన్నాళ్లకు విరాట్‌తో సైతం తమన్నా విడిపోయింది. ఆ తర్వాత విరాట్ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మను వివాహం చేసుకున్నాడు. ఇక తమన్నా మాత్రం ఇప్పటికీ ఒంటిరిగానే మిగిలిపోయింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి