నాగచైతన్య అదృష్టం పరుగులు తీస్తోంది. ‘లవ్ స్టోరీ’ సూపర్ సక్సస్ తరువాత విడుదలైన ‘బంగార్రాజు’ మూవీకరోనా వ్యతిరేక పరిస్థితులలో కూడ సంక్రాంతి వీకెండ్ ముగిసే సరికి 35కోట్లు గ్రాస్ కలక్షన్స్ వసూలు చేసింది అని వస్తున్న వార్తలు ఇండస్ట్రీ వర్గాలలో సంచలనంగా మారింది. వరస హిట్లు రావడంతో చైతూ మార్కెట్ కూడ బాగా పెరిగింది అంటూ కామెంట్స్ వస్తున్నాయి.


ఈ సంవత్సరం చైతన్య బాలీవుడ్ ఎంట్రీ కూడ జరగబోతోంది. బాలీవుడ్ టాప్ హీరో అమీర్ ఖాన్ తో కలిసి నటించిన ‘లాల్ సింగ్ చద్దా’ ఈమూవీ ఈ ఏడాది ఏప్రియల్ లో విడుదల కాబోతోంది. ఈ మూవీ విడుదలకు ఇంకా సమయం ఉన్నప్పటికీ వరస హిట్స్ తో జోష్ లో ఉన్న చైతన్య ఒక బాలీవుడ్ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన మాజీ భార్య సమంత పై కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేసాడు.


సినిమాలకు సంబంధించి తన స్క్రీన్ ప్రెజన్స్ ఏ హీరోయిన్ తో చాల బాగుంటుంది అన్న విషయమై మాట్లాడుతూ స్క్రీన్ మీద తాను సమంతతో కలిసి నటించినప్పుడు తమ జంట చాల బాగుంటుందని చాలామంది చెపుతూ ఉంటారని ఆ విషయం తనకు కూడ నిజమే అనిపిస్తుంది అంటూ కామెంట్స్ చేసాడు. సమంతతో విడిపోయిన తరువాత తిరిగి సినిమాలలో ఆమెతో కలిపి నటించే విషయంలో స్పందిస్తూ భవిష్యత్ లో ఎప్పుడు ఏమి జరుగుతుందో ఎవరికీ తెలియదు అంటూ అభిప్రాయ పడ్డాడు.


ఇక బాలీవుడ్ సినిమాల గురించి మాట్లాడుతూ మంచి కథలు దర్శకులు దొరికితే తనకు ఎక్కువగా బాలీవుడ్ సినిమాలు చేయాలని ఉంది అంటూ తన మనసులో మాట బయట పెట్టాడు. అవకాశం వస్తే తనకు అలియా భట్ తో కానీ దీపిక పదుకొనె తో కాని నటించాలని ఉంది అంటూ తన మనసులో మాట బయట పెట్టాడు. ఈ సంవత్సరం చైతన్య కు బాగా కలిసి వచ్చినట్లే అనుకోవాలి. అమీర్ ఖాన్ తో నటిస్తున్న మూవీ కూడ హిట్ అయితే ఇక చైతన్యకు బాలీవుడ్ లో కూడ మంచి రోజులు వచ్చినట్లే అనుకోవాలి..    మరింత సమాచారం తెలుసుకోండి: