వర్మ హీరోయిన్లకు స్టార్ ఇమేజ్ వస్తుందో లేదో అస్సలు తెలియదు కానీ ఇన్‌స్టంట్ ఇమేజ్ మాత్రం సూపర్ గా వస్తుంది. అప్పటికప్పడు వాళ్ల గురించి ఇండస్ట్రీలో కూడా చర్చ బాగానే జరుగుతుంది. గతేడాది అలా వర్మ స్కూల్ నుంచి వచ్చి అందరిని పిచ్చెక్కించిన హీరోయిన్ అప్సర రాణి (Apsara Rani).


 భూమ్ బద్దలు అంటూ క్రాక్ సినిమాలో అందరికి పిచ్చెక్కించింది అప్సర రాణి. ఈమె కెరీర్‌లో కొన్ని అనుకోని సంఘటనలు కూడా జరిగాయి. వాటినే అభిమానులతో పంచుకుందట అప్సర.
ఈ రోజుల్లో సినిమాల్లో అవకాశాలు ఎంత మాములు అయిపోయాయో.. ఆ అవకాశాల కోసం పడుకోవడం కూడా అంతే మాములు విషయం అయిపోయాయని కొందరు హీరోయిన్‌లు బహిరంగం గానే చెప్తున్నారు. ఎలాంటి దాపరికం కూడా లేకుండా మనసులో మాట బయటకు చెప్తున్నారు. ఒక్కోసారి తమకు ఎదురైన దారుణమైన సంఘటనల గురించి కూడా అందరి ముందు మాట్లాడుకుంటున్నారు..


 ఇక్కడ ఆఫర్ రావాలంటే దర్శక నిర్మాతల కోరిక మనం తీర్చాల్సిందే.. వాళ్ల పడక గదికి మనం వెళ్లాల్సిందే అంటూ కుండ బద్ధలు కొట్టేస్తున్నారట . అక్కడక్కడా మంచోళ్లు వున్నారు తప్ప ఇక్కడ అందరూ కూడా అమ్మాయిల కోసం చొంగ కార్చుకునే వాళ్లే అంటూ ప్రగతి లాంటి సీనియర్ హీరోయిన్స్ కూడా చెప్పారు. అలా వచ్చినపుడు మనం ధైర్యంగా నిలబడాలి అంటున్నారట వాళ్లు.

 ఇదిలా ఉంటే మరో హీరోయిన్ కూడా ఇదే చెప్పిందట. వర్మ థ్రిల్లర్ సినిమాతో పాపులర్ అయిన అంకిత మహరాణ తనకు ఎదురైన చేదు అనుభవాల గురించి ఇలా చెప్పుకొచ్చింది. వర్మ చేతుల్లో పడిన తర్వాత అంకిత కాస్తా అప్సర రాణిగా మారిపోయిందట. అక్కడ్నుంచి ఆమె దశ మారిపోయింది. అవకాశాలు కూడా బాగా వస్తున్నాయి. చిన్నవో పెద్దవో సినిమాలైతే చేస్తుందట అప్సర.


 వరసగా వర్మ కంపెనీలోనే సినిమాలకు కమిట్ అవుతుందట అప్సర రాణి. ఈమెతో వరస సినిమాలు ప్లాన్ చేస్తున్నాడు వర్మ. థ్రిల్లర్ ట్రైలర్‌లో అందాలతో ఆమె రచ్చ చేసింది. బికినీ తప్ప మరోటి వేయనన్నట్లు రెచ్చిపోయిందట అప్సర. థ్రిల్లర్ సినిమాలో ఈమె అందాలు మాత్రమే ఫోకస్ చేసాడు వర్మ. అయితే ఈ సినిమాకు ముందు తనకు ఎదురైన చేదు అనుభవాల గురించి ఆమె చెప్పుకొచ్చింది


 ఈమెకు కన్నడ ఇండస్ట్రీలో ఓ సినిమాలో హీరోయిన్‌గా ఎంపిక చేసారట.అయితే డిస్కషన్స్ కోసం మాత్రం రూమ్‌కు ఒంటరిగా రమ్మన్నారని తెలిపిందట అప్సర. తన కోరిక తీరిస్తే అవకాశం ఇస్తానన్నాడని ఆ మాటలు ఇప్పుడు గుర్తు చేసుకుంది ఈ భామ. తాను మాత్రం అక్కడికి తన నాన్నను కూడా తీసుకెళ్లానని కానీ అక్కడ పరిస్థితి అర్ధమైపోయి నాన్నతో కలిసి తాను కూడా పారిపోయి వచ్చానని చెప్పుకొచ్చిందట అప్సర రాణి.


 తెలుగులో మాత్రం ఇప్పటి వరకు తనకు అలాంటి వేధింపులు అస్సలు ఎదురవ్వలేదని చెప్పింది ఈమె. తెలుగులో టాలెంట్ ఉన్న వాళ్లకు మంచి ఛాన్సులు కూడా వస్తాయని.. ఒక సినిమా క్లిక్ అయితే చాలు తెలుగు ప్రేక్షకులు వాళ్ళని ఎంతగానో ఆదరిస్తారని అప్సర తెలిపింది. థ్రిల్లర్ కంటే ముందు రెండు సినిమాలు చేసినా కూడా అసలు ఈమెను ఎవరు కూడా గుర్తు కూడా పట్టలేదట ఆడియన్స్. అలాంటి సమయంలో క్రాక్ సినిమాతో రచ్చ చేసింది అప్సర. ఆ తర్వాత గోపీచంద్ సీటీమార్ సినిమాలో కూడా ఈమె చేసిన ఐటం సాంగ్ కూడా అదిరిపోయింది. ఇప్పుడు మరికొన్ని సినిమాలలో కూడా ఐటం సాంగ్స్ ఈమె చేయబోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: