టాలీవుడ్ లో ఇటీవల వరుస ఫ్లాప్ లతో ఇబ్బంది పడ్డ మాస్ మహారాజా రవితేజ ఎట్టకేలకు 'క్రాక్' సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నాడు. ఇక క్రాక్ విజయంతో ఫుల్ ఫామ్ లోకి వచ్చాడు ఈ హీరో. దీంతో ప్రస్తుతం వరుస సినిమాలను లైన్లో పెడుతున్నాడు. ఇక ప్రస్తుతం రమేష్ వర్మ దర్శకత్వంలో 'ఖిలాడి' అనే సినిమా చేస్తున్నాడు రవితేజ. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా ఫిబ్రవరి 11 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఇదిలా ఉంటే తాజా సమాచారం ప్రకారం రవితేజ ఖిలాడి మూవీ బాలీవుడ్ లో కూడా రిలీజ్ అయ్యే అవకాశం ఉందట. 

గతంలో రవితేజ నటించిన కొన్ని సినిమాలు హిందీలో డబ్ అయి.. యూట్యూబ్లో రిలీజ్ కాగా అవి సూపర్ హిట్ గా నిలిచాయి. దీంతో యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఖిలాడి కూడా హిందీ వెర్షన్ లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. ఇటీవల అల్లు అర్జున్ నటించిన 'పుష్ప' మూవీ బాలీవుడ్లో హిట్ అవడంతో ఖిలాడి సినిమా నిర్మాతలు కూడా బాలీవుడ్ రిలీజ్ కు ఆసక్తి చూపుతున్నారట. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన మాత్రం రావాల్సి ఉంది. ఇక ఈ సినిమాలో రవితేజ ద్విపాత్రాభినయం పోషిస్తున్నారు. పైగా ఈ సినిమాలో తండ్రి కొడుకులుగా కనిపించబోతున్నారట. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.

ఇక ఈ సినిమాలో రవితేజ సరసన ఇద్దరు హీరోయిన్లు నటిస్తున్నారు. ఆ ఇద్దరిలో ఒకరు మీనాక్షి చౌదరి. మరొకరు డింపుల్ హయాతి. మరోవైపు ఈ సినిమాలో రవితేజకు విలన్గా యాక్షన్ కింగ్ అర్జున్ నటిస్తున్నాడు. భారీ అంచనాలతో రాబోతున్న ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పాటలకు మంచి రెస్పాన్స్ రాగా రవితేజ పుట్టిన రోజు కానుకగా జనవరి 26న సినిమా నుంచి మరో పాట కూడా విడుదల కాబోతోంది. తాజాగా ఈ విషయాన్ని ఓ పోస్టర్ తో మేకర్స్ అధికారికంగా ప్రకటించారు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: