ప్రస్తుతం సోషల్ మీడియాలో అల్లు అర్జున్ గురించిన వార్తలు భారీ స్థాయిలో వైరల్ అవుతున్నాయి. ఒకప్పుడు ఆయనను ఐకాన్ స్టార్, స్టైలిష్ స్టార్ అని అభిమానులు పిలిచేవారు. కానీ ఇప్పుడు ఆ స్థాయి అంతా దాటి, ‘వరల్డ్ స్టార్’ అంటూ గ్లోబల్ రేంజ్‌లో పలకరించేలా మారిపోయింది అల్లుఅర్జున్ క్రేజ్. ఈ పేరు ఆయన సాధారణంగా అందుకున్నదేం కాదు… పుష్ప తర్వాత అల్లు అర్జున్ స్థాయి నేరుగా పాన్–ఇండియా కాదు, పాన్–వరల్డ్ స్థాయికి చేరుకుందని ఇండస్ట్రీ అంతా చెప్పుకుంటోంది.


ఈ క్రమంలో ప్రస్తుతం అల్లుఅర్జున్–అట్లీ కాంబినేషన్‌పై వస్తున్న వార్తలు కూడా మరింత హీట్ పెంచేస్తున్నాయి. సౌత్ ఇండియా నుండి బాలీవుడ్ వరకు, ఇప్పుడు హాలీవుడ్ సర్కిల్ వరకూ గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ అట్లీ, అల్లు అర్జున్‌తో ఒక భారీ యాక్షన్ ఎంటర్టైనర్ చేయబోతున్నాడు. అంతేకాదు, ఈ సినిమాలో అల్లుఅర్జున్‌కు ఏకంగా ఐదుగురు టాప్ హీరోయిన్లతో రొమాన్స్ సీన్స్ ఉంటాయట అన్న వార్త అభిమానుల్లో రెట్టింపు ఉత్సాహం కలిగిస్తోంది. ఇందులో మరో సెన్సేషనల్ అప్డేట్ ఏమిటంటే — అట్లీ సినిమా కంటే ముందే అల్లుఅర్జున్ తెరపై కనిపించబోతున్నాడన్నది! అది కూడా ఓ ఇంటర్నేషనల్ బ్రాండెడ్ ప్రోడక్ట్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా. ఆ బ్రాండ్ కోసం అల్లు అర్జున్ ప్రత్యేకంగా ఓ గ్రాండ్ అడ్వర్టైజ్‌మెంట్ షూట్ చేయబోతున్నాడట. ఈ ప్రాజెక్ట్‌ను మరింత ప్రెస్టీజస్‌గా మార్చే విషయం ఏమిటంటే… ఆ యాడ్‌ను డైరెక్ట్ చేయబోతున్నది సుకుమార్ అని ఇండస్ట్రీ సర్కిల్స్‌లో బలంగా వినిపిస్తోంది.



సుకుమార్ మరియు అల్లు అర్జున్ కాంబినేషన్ అంటే అభిమానులకు ఎంత స్పెషల్ అనేదే తెలిసిందే. ఆర్య నుండి పుష్ప వరకు ఈ ఇద్దరి కలయిక ఎప్పుడూ మేజిక్ క్రియేట్ చేసింది. అలాంటి జోడీ ఇప్పుడు ఓ ఇంటర్నేషనల్ యాడ్ కోసం కలిసి పనిచేస్తుందన్న వార్త సోషల్ మీడియాలో మరింత హైప్ క్రియేట్ చేస్తోంది. అన్నీ అనుకున్నట్టే కుదిరితే, అట్లీ సినిమా కంటే ముందే సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ కనిపించబోతున్నాడన్న ఈ లీక్ ప్రస్తుతం వైరల్ అవుతోంది.
మొత్తం మీద — అల్లుఅర్జున్ - సుకుమార్ యాడ్, అల్లుఅర్జున్- అట్లీ మూవీ, వరల్డ్ స్టార్ హైప్… అన్నీ కలిసి సోషల్ మీడియాలో సునామీలా మారాయి. ఫ్యాన్స్ మాత్రం— “ఇంకా అధికారిక అనౌన్స్‌మెంట్ రాకముందే పరిస్ధితి ఇలా ఉంటే ఇక రిలీజ్ టైమ్‌లో ఎలాంటి హంగామా ఉంటుందో ఊహించలేం!” అంటూ కమెంట్స్‌తో ఫీడ్స్ నింపేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: