అయితే యంగ్ టైగర్ ఎన్టీఆర్ సతీమణి మాత్రం ఇప్పటి వరకు సోషల్ మీడియా వైపు చూసింది లేదు. వీరి వివాహం 2011 లో జరిగిన విషయం తెలిసిందే. కాగా దాదాపు అందరి స్టార్ హీరోల భార్యలు సోషల్ మీడియా వేదికలో ఎంట్రీ ఇచ్చి పోస్ట్లు పెడుతూ ఉండగా... ఎన్టీఆర్ అభిమానులు సైతం వారి హీరో సతీమణి లక్ష్మి ప్రణతి సైతం సోషల్ మీడియా లోకి అడుగు పెట్టాలని ఆకాంక్షించారు. అయితే ఇన్నాళ్ళకి వాళ్ల ఆకాంక్ష నిజమైంది. తాజాగా లక్ష్మి ప్రణతి కూడా సామాజిక వేదికపైకి అడుగుపెట్టారు. మొదటగా తన భర్త జూనియర్ ఎన్టీఆర్ కు సంబందించిన విషయాన్ని పోస్ట్ చేసింది. ఎన్టీఆర్ కు ట్విట్టర్ లో చెప్పినటువంటి రిపబ్లిక్ డే విషెష్ ని షేర్ చేసి తన సంతోషాన్ని వ్యక్తం చేశారు.
పోస్టింగ్ మై ఫస్ట్ ట్వీట్ విత్ మై లవ్లీ హస్బెండ్ ” అని ఎన్టీఆర్ ని ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు. ఆ తరువాత నిన్న దర్శకుడు రాజమౌళి ఆయన సతీమణి రమా రాజమౌళి, ఎన్టీఆర్, ప్రణతిలు ఉన్న పాత గ్రూప్ ఫోటోని షేర్ చేశారు లక్ష్మి ప్రణతి. ఇలాగే ఆమె సోషల్ మీడియాలో ఫ్యాన్స్ కు టచ్ లో ఉండాలని కోరుకుంటున్నారు నందమూరి అభిమానులు. అయితే కాసేపటి క్రితం లక్ష్మి ప్రణతి తాను 5000 ఫాలోయర్స్ ను సాధించినందుకు సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఒక పోస్ట్ ను పెట్టింది. ముందు ముందు ఇంకా ఫాలోయర్స్ పెరగాలని తన ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి