ఇక ఇదిలా ఉండగా.. రామ్ గోపాల్ వర్మ తాజాగా చేసిన ఒక పోస్ట్ బాగా వైరల్ గా మారుతుంది.. అదేమిటంటే ఈ రోజు వాలెంటైన్స్ డే సందర్భంగా ప్రతి ఒక్కరు తాము ప్రేమించిన వారికి ఏదో ఒక గిఫ్ట్ ఇచ్చి సర్ప్రైజ్ చేస్తూ ఆనంద పరుస్తూ వుంటారు .ఇలాంటి సందర్భంలో .. వర్మ చేసిన పోస్టు తెగ వైరల్ గా మారడం గమనార్హం. వర్మ తన ట్విట్టర్ ఖాతా ద్వారా అమ్మాయిల బెడ్ రూమ్ రొమాన్స్ ఫోటోలను షేర్ చేస్తూ .. అన్ హ్యాపీ వాలెంటైన్స్ డే అని పోస్ట్ చేయడం జరిగింది.. అంతే కాదు కింద హ్యాష్ ట్యాగ్ రూపంలో కొన్ని వర్డ్స్ కూడా షేర్ చేసుకున్నారు వర్మ.
మరొక ట్వీట్ లో ఒక అబ్బాయి.. ఒక అమ్మాయికి తక్కువ ఖర్చుతో కూడిన కానుక ఇచ్చి.. ఇది బహుమతి కాదు.. దాని వెనుక ఉన్న నా ప్రేమ అని చెప్తే.. దాని అర్థం ఆ వ్యక్తి దగ్గర డబ్బులు లేవని' అని అందుకే అన్ హ్యాపీ వాలెంటైన్స్ డే అంటూ రాసుకొచ్చాడు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి