సూర్య హీరోగా తెరకెక్కుతున్న గత కొన్ని చిత్రాలు ప్రేక్షకులను భారీ స్థాయిలో అలరిస్తున్నాయి. అయితే ఆ సినిమాలు ధియేటర్ లో కాకుండా ఓ టీ టీ లో విడుదల అవడమే సూర్య అభిమానులను నిరాశపరిచిన విషయం. అయితే ఎక్కడ విడుదల అయితేనే ప్రేక్షకులు భారీ స్థాయిలో ఆ చిత్రాలను వీక్షించి సూర్య కెరియర్ లో అద్భుతమైన విజయాలు వచ్చేలా చేశారు అని అంటున్నారు. తాజాగా ఆయన పాండిరాజ్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ ను విడుదల చేశారు.
అయితే తెలుగులో ఎన్నో అంచనాల మధ్య రాబోతున్న విషయం ఇప్పుడు చర్చనీయాంశం అవుతుంది. అయితే ఈ సినిమా టైటిల్ ఇలా పెట్టడం వెనుక కారణం ఏంటో తెలియదు కానీ తమిళ అనువాద చిత్రాలకు టైటిల్స్ ఎవరికీ అర్థం కాని విధంగా పెట్టడం వల్ల వారికి భారీగా నష్టం అవుతుంది అనే విషయాన్ని వారు ఎందుకో ఆలోచించడం లేదు. ఇటీవల కాలంలో వస్తున్న తమిళ సినిమాలు అన్నిటికీ అలాంటి పేర్లు పెడుతూ తెలుగు ప్రేక్షకులను ఎంతగానో కన్ఫ్యూజ్ చేస్తున్నారు.
గురువారం ప్రేక్షకుల ముందుకు రాబోతున్న వలిమై సినిమా పై తమిళంలో భారీ అంచనాలు ఉన్నాయి అదే సమయంలో అజిత్ అభిమానులు తెలుగులో కూడా భారీ స్థాయిలో ఉన్న నేపథ్యంలో ఇక్కడ కూడా ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో రిలీజ్ చేస్తూ ఉన్నారు అయితే దానికి వలీమై అనే టైటిల్ ని తెలుగులో కూడా పెట్టడం దారుణం. తెలుగులో అర్థం వచ్చేలా ఏదో పేరు పెట్టవచ్చు కదా అని చెబుతున్నారు. ఇక సూర్య ఎదుర్కుం తునిందవన్ సినిమా ను మార్చి 10 న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. దేనికి భయపడని వాడు అని అర్థం వచ్చే దీన్ని షార్ట్ ఫామ్ గా ఈటీ అనే పేరు పెట్టడం నిజం గా విడ్డూరం.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి