ఇకపోతే మంచు విష్ణు ఇటీవల కాలంలో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు అన్న విషయం తెలిసిందే. ఇకపోతే ఇప్పుడు మంచు విష్ణు సినిమాకు సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. మంచు విష్ణు హీరోగా తెరకెక్కుతున్న గాలి నాగేశ్వరావు సినిమాలో సన్నీ లియోన్ నటిస్తూ ఉందట. ఇక ఈ సినిమాలో తాను రేణుక అనే పాత్రలో నటిస్తున్నాను అంటూ ఒక పోస్టు ద్వారా ఈ విషయాన్ని వెల్లడించింది సనిలియన్. ఇక ఈ సినిమాకి ఇషాన్ సూర్య దర్శకత్వం వహించనున్నాడు అనే విషయం తెలిసిందే.
ఇక ఈ సినిమాకి కథ స్క్రీన్ ప్లే కోనవెంకట్ అందిస్తూ ఉండడంతో ఇక ప్రస్తుతం ఈ సినిమాపై భారీగానే అంచనాలు ఉన్నాయి. ఇదిలా ఉంటే బాలీవుడ్ హాట్ బ్యూటీ సన్నీ లియోన్ గతంలో మంచు విష్ణు తమ్ముడు మంచు మనోజ్ కరెంట్ తీగ సినిమా లో నటించి తన హాట్ హాట్ అందాలతో అందరి చూపులు ఆకర్షించింది అనే విషయం తెలిసిందే. కరెంట్ తీగ సినిమా లో ఒక టీచర్ పాత్రలో కనిపించింది సన్నీ లియోన్. ఇక ఇప్పుడు ఏకంగా అన్నయ్య మంచు విష్ణుతో కలిసి నటిస్తూ ఉండడంతో ఇక అన్నదమ్ములిద్దరి సినిమాల్లో సన్నీ లియోన్ భలే ఛాన్స్ కొట్టేసింది అంటూ కామెంట్లు పెడుతున్నారు అభిమానులు..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి