ప్రస్తుతం హాట్ హీరోయిన్ పూజా హెగ్డే టాలీవుడ్.. కోలీవుడ్ అని మాత్రమే కాకుండా పాన్ ఇండియా రేంజ్ లో స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతుంది. తమిళంలో ఈ హాట్ బ్యూటీ విజయ్ కి జోడిగా బీస్ట్ సినిమాలో నటించగా.. హిందీలో సల్మాన్ ఖాన్ కి జంటగా ఒక సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. మొత్తానికి పూజా హెగ్డే వరుస సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంటుంది. తాజాగా డస్కీ బ్యూటీ నటించిన రాధేశ్యామ్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఇక ఆ సినిమా ప్రమోషన్ లో భాగంగా పలు ఇంట్రెస్టింగ్ విషయాలను కూడా పూజా హెగ్డే వెల్లడించింది. ఈమధ్య ఒక ఇంటర్వ్యూలో రాధేశ్యామ్ సినిమా జాతకాలు.. ఇంకా హస్త సాముద్రికం గురించి ఉంటుంది కదా.. మీరు జాతకాలను నమ్ముతారా అలాగే విధిరాతను నమ్ముతారా అంటూ ప్రశ్నించగా పూజా హెగ్డే ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. తాను విధి రాతను నమ్ముతాను అంటూ పూజా హెగ్డే తేల్చి చెప్పింది.విధి రాత వల్లే తాను ఈ స్థాయికి వచ్చానని కూడా చెప్పుకొచ్చింది.



 ఒక మధ్యతరగతికి చెందిన ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ నుండి తాను ఈ స్టేటస్ కి రావడం అనేది ఖచ్చితంగా విధే అయ్యి ఉంటుందని బలంగా నమ్ముతున్నాను అని పూజా చెప్పుకొచ్చింది. ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ అయినా కాని సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టడం ఏంటి.. సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన మొదట్లో వరుసగా వరుసగా ఎన్నో పరాజయాలు ఎదురయినా కూడా హీరోయిన్ గానే గట్టి ప్రయత్నాలు చేశాను.ఇక నా విధి రాత ఇలా ఉండడం వల్ల ఆ టైమ్ లో ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేశాను. హీరోయిన్ గా చేయాలనే ఇంట్రెస్ట్ కోరిక ఎక్కువగా లేకుండానే తాను ఈ స్థాయికి చేరానంటే అది కేవలం విధి రాత అని బలంగా నమ్ముతాను అంటూ బుట్టబొమ్మ పూజా హెగ్డే చెప్పుకొచ్చింది.


ఇక సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి ప్రోత్సాహం అనేది లేకుండా తెలిసిన వాళ్లు లేకుండా ఈ స్థాయికి నేను చేరుకున్నాను అంటే అది నా అదృష్టం ఇంకా అలాగే విధిరాత అని నేను బలంగా నమ్ముతాను అంటూ పూజా హెగ్డే విధి రాత విషయంలో ఇంట్రెస్టింగ్ చేసింది. జీవితంలో కూడా ముందుకు నడిపించేది కేవలం విధే. కాబట్టి మనం ఆ విషయంలో నమ్మకాన్ని ఎక్కువగా కలిగి ఉండవచ్చు అంటూ ఆమె కామెంట్స్ చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: