అంతేకాదండోయ్ ఇక ఫిట్నెస్ విషయంలో ఎంతో ఖచ్చితత్వం తో ఉండే సమంత ఇక ఇటీవల జిమ్ లో వర్కౌట్లు చేస్తూ భారీగా బరువు ఎత్తుతున్న వీడియోలు కూడా సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిపోతున్నాయి. ఇలా ఒక వైపు సినిమాల పరంగా మరోవైపు బిజినెస్లో ఇంకోవైపు సోషల్ మీడియాలో కూడా సమంత దూకుడు ప్రదర్శిస్తోంది అని చెప్పాలి. అంతేకాదు వాణిజ్య ప్రకటనలు కూడా కాస్త ఎక్కువగానే చేస్తుంది ఈ ముద్దుగుమ్మ. ఇకపోతే ఇటీవలే సమంత పోస్ట్ చేసిన ఒక వీడియో కాస్త వైరల్ గా మారిపోయింది.
ఏకంగా భారీగా బరువు ఎత్తుతున్నా ఇక ఈ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది ఈ ముద్దుగుమ్మ. ఈ క్రమంలోనే ఈ వీడియో చూసిన తర్వాత సమంత పడుతున్న కష్టాన్ని చూసి ప్రతి ఒక్కరూ ఫిదా అవుతున్నారు. సమంత ఎంతో అందంగా కనిపించి అందరి దృష్టిని ఆకర్షించడం వెనుక.. తన బాడీని ఫిట్ గా వుంచుకుని టాప్ హీరోయిన్గా కొనసాగడం వెనుక. ఇక స్టార్ హీరోయిన్గా ఒక్కో మెట్టు ఎదగడం వెనుక ఎంతగానో కష్టం ఉంది అంటూ ఇక ఈ వీడియో చూసిన తర్వాత కామెంట్లు చేస్తూ ఉన్నారు అభిమానులు. ఈ వీడియోలో తన ట్రైనర్ సహాయంతో ఎంతో సులభంగా కష్టతరమైన వర్కౌట్ కూడా పూర్తి చేసింది ముద్దుగుమ్మ సమంత.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి