రష్మిక మందన కన్నడ చిత్ర పరిశ్రమలోని సినిమాలతో సినీ రంగ ప్రవేశం చేసి తెలుగు సినిమాల ద్వారా భారీ పాపులారిటీ సంపాదించుకుని ఇప్పుడు టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఈ నేపథ్యంలోనే ఆమె బాలీవుడ్ లో పలు ఆసక్తికరమైన ప్రాజెక్టులను చేస్తుంది. అంతేకాకుండా తమిళ చిత్ర పరిశ్రమలోని టాప్ హీరోల సరసన కూడా ఈమె నటిస్తోంది. ఇప్పటికే వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న విజయ్ దళపతి సినిమాలో కూడా ఎంపిక అయినట్లు నిన్న అధికారిక ప్రకటన వచ్చింది.ఆ విధంగా తమిళంలో కూడా ఆమె తన ప్రతాపం చూపించనుంది.
అక్కడి సినిమా పరిశ్రమలో ఆమె కెరియర్ కూడా ఎంతో సాఫీగా సాగుతుంది. తాజాగా అర్జున్ రెడ్డి సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో యానిమల్ అనే సినిమాలో కూడా ఎంపిక అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తెలుగులో భారీ బ్లాక్ బస్టర్ హిట్ అయిన అర్జున్ రెడ్డి సినిమాను హిందీలో తెరకెక్కించి అక్కడ కూడా భారీ విజయాన్ని అందుకున్న ఈ దర్శకుడు తన తదుపరి చిత్రంగా రణబీర్ కపూర్ తో కలిసి ఈ చిత్రాన్ని చేస్తున్నాడు. ఒక డిఫరెంట్ సినిమా గా వస్తున్న దీనికి మంచి కథ ఉండబోతుందట.
అలా సినిమాలోని పాత్రలకు కూడా ప్రాధాన్యత భారీగా ఉంటుందట. మనుషుల్లో మారుతున్న స్వభావాల చుట్టూ తిరిగే ఈ సినిమా స్క్రిప్ట్ తప్పకుండా అందరినీ భారీ స్థాయిలో మెప్పిస్తుంది అని చెబుతున్నారు. అడవుల్లో తిరిగే జంతువులా మనిషి మారితే ఎలా ఉంటుంది అనే డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఈ సినిమాను సిద్ధం చేస్తున్నారు. అలా హీరోగా రణభీర్ కపూర్ సరసన హీరోయిన్ గా రష్మిక మందన ను ఫిక్స్ చేశారట. ఈ నేపథ్యంలో ఈమె మాత్రమే ఆ పాత్రకు న్యాయం చేయగలదని నమ్మి ఆమె ఎంపిక చేశాడు సందీప్ రెడ్డి వంగ. సైన్స్ స్టూడెంట్ గా ఆమె కనిపించబోతుంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి