‘ఆర్ ఆర్ ఆర్’ లో నటించేందుకు ఒక అవకాశం ఇవ్వమని అలియా భట్ స్వయంగా రాజమౌళిని గతంలో ఎయిర్ పోర్ట్ లో కలిసినప్పుడు అడిగింది అంటారు. అలియా భట్ కోరికను రాజమౌళి మన్నించి ఆమెకు ‘ఆర్ ఆర్ ఆర్’ లో ఒక కీలక పాత్రను ఇచ్చాడు. ఈసినిమా పూర్తి అయ్యేవరకు రాజమౌళితో అలియా భట్ కు చాలమంచి సాన్నిహిత్యం కొనసాగింది.
ఈసినిమా జనవరిలో సంక్రాంతి రేస్ కు విడుదల అవుతుంది అని మొదట్లో భావించినప్పుడు ఈసినిమా ప్రమోషన్ లో అలియా భట్ ‘ఆర్ ఆర్ ఆర్’ టీమ్ తో కలిసి చాల ఉత్సాహంగా పాల్గొంటూ అనేక ఇంటర్వ్యూలు ఇచ్చింది. అయితే ఆమూవీ ఒమైక్రాన్ వైరస్ వల్ల వాయిదా పడటంతో ఆతరువాత మార్చి విడుదల సమయంలో మాత్రం అలియా భట్ ‘ఆర్ ఆర్ ఆర్’ ప్రమోషన్ లో ఎక్కడా కనిపించలేదు.
దీనితో అలియా భట్ కు ‘ఆర్ ఆర్ ఆర్’ టీమ్ పై కోపం వచ్చింది అంటూ గాసిప్పులు మొదలయ్యాయి. దీనికితోడు ఈమూవీలో అలియా భట్ పాత్రను బాగా తగ్గించి వేయడం కూడ అలియా భట్ కు కోపం తెప్పించింది అంటారు. ముంబాయ్ లో జరిగిన ఈమూవీ సక్సస్ మీట్ లో కూడ అలియా భట్ కనిపించలేదు. దీనితో అలియా ‘ఆర్ ఆర్ ఆర్’ టీమ్ ను పూర్తిగా దూరం పెట్టింది అని అనుకున్నారు అంతా.
అయితే అలియా ఊహించని ట్విస్ట్ ఇచ్చింది. ఏప్రియల్ 14న జరగబోతున్న తన పెళ్ళి వేడుకలకు రావలసిందిగా రాజమౌళిని జూనియర్ రామ్ చరణ్ లతో పాటు ఆమూవీ నిర్మాతను కూడ అలియా భట్ వ్యక్తిగతంగా పిలిచినట్లు టాక్. దీనితో వీరంతా ముంబాయ్ లోని తాజ్ హోటల్ జరగబోతున్న అలియా పెళ్ళి రిసెప్క్షన్ వేడుకలకు తమ భార్యలతో కలిసి ఒక ప్రవేట్ ఫ్లైట్ లో వెళ్ళబోతున్నారని సమాచారం. అందుకే రాజకీయాలలో సినిమాలలో శాశ్విత మిత్రులు శాశ్విత శత్రువులు ఉండరు అని అంటారు..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి