దర్శకుడు మురుగ దాస్ గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మురుగ దాస్ కోలీవుడ్ సినిమాల ద్వారా దర్శకుడిగా ఫుల్ క్రేజ్ ని సంపాదించుకున్నాడు.  ఇలా హాలీవుడ్ సినిమాల ద్వారా దర్శకుడిగా ఫుల్ క్రేజ్ ను సంపాదించుకున్న మురుగ దాస్ నేరుగా టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిన స్టాలిన్ సినిమాకు దర్శకత్వం వహించి తెలుగు నాట కూడా మురుగ దాస్ దర్శకుడిగా మంచి క్రేజ్ ను సంపాదించుకున్నాడు.  ఆ తర్వాత దర్శకుడు మురుగ దాస్,  సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన స్పైడర్ సినిమాను తెలుగు తో పాటు తమిళం లో కూడా తెరకెక్కించాడు.  కాకపోతే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది.

ఇది ఇలా ఉంటే దర్శకుడు మురుగ దాస్ చివరగా సూపర్ స్టార్ రజనీ కాంత్ హీరోగా తెరకెక్కిన దర్బార్ సినిమా కు దర్శకత్వం వహించాడు. ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ థియేటర్ లలో విడుదలైనప్పటికీ సర్దార్ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకోలేక బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది.  ఇది ఇలా ఉంటే తాజాగా దర్శకుడు మురుగ దాస్ కోలీవుడ్ ఇండస్ట్రీ క్రేజీ హీరో తో సినిమాను  చేయబోతున్నట్లు తెలుస్తోంది. మురగదాస్ కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్ తో ఒక సినిమా చేయనున్నట్లు ఒక వార్త నెటింట్లో వైరల్ అవుతుంది.  ఇప్పటికే దర్శకుడు మురగదాస్ , విక్రమ్ కు ఒక కథ వినిపించినట్టు ఆ కథ బాగా నచ్చడంతో విక్రమ్ కూడా ఆ ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు ఒక వార్త న వైరల్ అవుతుంది.  ఇది ఇలా ఉంటే మురగదాస్ , విక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కబోయే సినిమాను భారీ బడ్జెట్ తో సన్ పిక్చర్స్ వారు నిర్మించనున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: