‘సర్కారు వారి పాట’ మూవీ సూపర్ సక్సస్ కావడంతో విలక్షణ నటుడు సముధ్రఖని కి ఇక ఎదురులేదు అన్న ఫీలింగ్ ఇండస్ట్రీ వర్గాలలో ఏర్పడింది. ఇప్పటివరకు టాప్ హీరోల సినిమాలకు విలన్ గా ప్రముఖ స్థానాన్ని పొందిన ప్రకాష్ రాజ్ జగపతి బాబులకు సముధ్రఖని ప్రత్యామ్నాయం కానున్నాడా అన్నచర్చలు మొదలయ్యాయి. ‘సర్కారు వారి పాట’ ఘన విజయంలో సముధ్రఖని పాత్ర అత్యంత కీలకం.


ప్రస్తుతం ఇతడి హవా బాగా కొనసాగుతున్న పరిస్థితులలో అనేక మీడియా సంస్థలకు ఇతడు వరసపెట్టి ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. లేటెస్ట్ గా ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తనకు జూనియర్ ఎన్టీఆర్ తో ఉన్న పరిచయం గురించి మాట్లాడుతూ అతడి పై కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేసాడు. జూనియర్ మంచి నటుడు మాత్రమే కాకుండా రాజకీయాల గురించి చాల అవగాహన వ్యక్తి అని అనేక జాతీయ సమస్యల గురించి జాతీయ నాయకుల గురించి చాలామందికి తెలియని విషయాలు జూనియర్ మాటల సందర్భంలో చెపుతూ ఉంటాడనే సీక్రెట్ బయటపెట్టాడు.


అంతేకాదు అవకాశం దొరికినప్పుడల్లా తారక్ అనేక రాజకీయ పత్రికలు చదువుతూ అనేక విషయాల పై తన అవగాహన పెంచుకుంటాడని కామెంట్స్ చేసాడు. అంతేకాదు రాజకీయాల గురించి అంతగా పట్టించుకున్నట్లు కనిపించని తారక్ మాటలలో అంతర్లీనంగా ఒక రాజకీయనాయకుడు తనకు కనిపించాడని భవిష్యత్ లో జూనియర్ ప్రత్యక్ష రాజకీయాలలోకి వస్తే అతడు సక్సస్ కావడం ఖాయం అన్న అభిరాయం తనకు ఉంది అని అభిప్రాయ పడుతున్నాడు.


తెలుగుదేశం పార్టీ పరాజయం చెందినప్పటి నుంచీ ఎంతోమంది తెలుగుదేశంలోని నందమూరి అభిమానులు జూనియర్ ప్రత్యక్ష రాజకీయాలలోకి రావాలని కోరుకుంటున్నారు. ఈ విషయమై తారక్ వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నాడు. సముద్రఖని తారక్ పై వెలిబుచ్చిన అభిప్రాయాలను నిశితంగా పరిశీలిస్తే ఇప్పుడు కాకపోయినా మరో 10 సంవత్సరాలు తరువాత అయినా జూనియర్ రాజకీయ రంగప్రవేశం ఖాయం అన్న అభిప్రాయం ఎవరికైనా కలుగుతుంది అని అనిపించడం సహజం..

మరింత సమాచారం తెలుసుకోండి: