హెబ్బా పటేల్.. ఈ అమ్మడు గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం అక్కర్లేదేమో.  ఇప్పటికే ఎన్నో సినిమాలలో తన అందం అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసింది హెబ్బా పటేల్. దేవకన్యలా కనిపించి ఎంతో మంది ప్రేక్షకుల మనసులు కూడా కొల్లగొట్టింది ఈ ముద్దుగుమ్మ. మంచి అందం టాలెంట్ ఉన్నప్పటికీ ఎందుకో అదృష్టం మాత్రం ఎప్పటికీ కలిసి రాలేదు అని చెప్పాలి.  ఈ అమ్మడు నటించిన సినిమాలు పెద్దగా హిట్ కాకపోవడంతో సరైన అవకాశాలను కూడా రావడం లేదు  ప్రస్తుతం అడపాదడపా సినిమాలు మాత్రమే చేస్తూ ప్రేక్షకులను అలరిస్తుంది ఈ ముద్దుగుమ్మ.


 ఇకపోతే ఇటీవల ఈ అందాల సుందరి ఈటీవీ లో ప్రసారమయ్యే శ్రీదేవి డ్రామా కంపెనీ అనే కార్యక్రమం లోకి వచ్చింది.  స్పెషల్ గెస్ట్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ షో మొత్తం లో సెంటరాఫ్ ఎట్రాక్షన్ గా మారిపోయింది అని చెప్పాలి. అయితే సాధారణంగా ఇలా ఒక షో లో గెస్ట్ గా ఎంట్రీ వచ్చిన హీరోయిన్లు కమెడియన్స్ తో సరదాగా మాట్లాడటం చేస్తూ ఉంటారు. షేక్ హ్యాండ్ కూడా ఇస్తారు  కానీ హెబ్బా పటేల్ మాత్రం కమెడియన్స్ అందరిని కూడా హగ్గుల తో ఆశ్చర్యపరిచింది.


 శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో సోషల్ మీడియా లో వైరల్ గా మారి పోయింది అని చెప్పాలి  ఈ ప్రోమోలో భాగంగా గెస్ట్ గా ఎంట్రీ ఇచ్చినా హెబ్బా పటేల్ ముందుగా హైపర్ ఆదికి హగ్ ఇస్తుంది. అటు రాం ప్రసాద్ కు హగ్ ఇస్తుంది. నాక్కూడా ఒక ఫ్రెండ్లీ హగ్ ఇవ్వండి అని అడగగానే అటు కమెడియన్ నరేష్ కి కూడా హగ్ ఇస్తుంది. దీంతో నరేష్ ఎంతో ఎక్సైట్ అవుతాడు. ఆనందంతో ఎగిరి గంతేస్తాడు. ఇలా గెస్ట్ గా వచ్చి అందరిని హగ్గులతో ముంచేసింది హెబ్బా పటేల్..

మరింత సమాచారం తెలుసుకోండి:

Etv