పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్ తో విడిపోయి ఎన్నో సంవత్సరాలు గడిచిపోయినా పవన్ అభిమానులు మాత్రం ఇప్పటికీ రేణు దేశాయ్ ని తమ వదినగానే భావిస్తారు. అంతేకాదు ఆమె మరో పెళ్ళి చేసుకోవాలని ప్రయత్నించినప్పుడు పవన్ అభిమానుల నుండి వచ్చిన తీవ్రమైన విమర్శలు తట్టుకోలేక ఆమె ఆ పెళ్ళి ప్రయత్నం విరమించుకున్నట్లు కూడ వార్తలు వచ్చాయి.


పవన్ పిల్లలు అకిరా నందన్ ఆద్య లు రేణు దేశాయ్ దగ్గర పెరుగుతూ ఉండటంతో ఆమె తరుచూ పవన్ పిల్లలలకు సంబంధించిన లేటెస్ట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసినప్పుడు అవి తరుచూ ట్రెండింగ్ గా మారిపోతూ ఉంటాయి. ఇప్పుడు అలాంటి సందర్భమే మరొకటి వచ్చింది. అకిరా నందన్ హైదరాబాద్ లోని అత్యంత ప్రాముఖ్యతతో కూడుకున్న ఇండస్ ఇంటర్నేషనల్ స్కూల్ లో ఈమధ్యనే ‘ప్లస్ టు’ పూర్తి చేసాడు.


ఈ సందర్భంగా ఆ స్కూల్ లో జరిగిన కాన్వికేషన్ ఫంక్షన్ లో అకిరా నందన్ కు అతడి చదువు పూర్తి అయినట్లుగా ఒక సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. ఈ ఫంక్షన్ కు రేణు దేశాయ్ ఆద్యలు కూడ వచ్చారు. అకిరా నందన కోరిక పై ఆ ఫంక్షన్ కు పవన్ కూడ వచ్చినట్లు తెలుస్తోంది. ఈ కాన్వికేషన్ ఫంక్షన్ కు సంబంధించిన ఫోటోను రేణు దేశాయ్ సోషల్ మీడియాలో షేర్ చేసిన కొద్ది క్షణాలలోనే అది వైరల్ గా మారింది.


కేవలం పవన్ కళ్యాణ్ అభిమానులు మాత్రమే కాకుండా జన సైనికులు కూడ పవన్ అకిరా ఆద్య రేణు దేశాయ్ లు కలిసి ఉన్న ఆ ఫోటోను తమ వాట్సప్ స్టేటస్ గా పెట్టుకుని మురిసిపోవడం చాలామందికి ఆశ్చర్య పరిచింది. ఈ విషయాలను నిశితంగా పరిశీలిస్తే రేణు పవన్ నుంచి విడిపోయినా ఆమెను మెగా ఫ్యామిలీ మెంబర్ గా పవన్ అభిమానులు ఇప్పటికీ గుర్తిస్తున్నారా అనే సందేహాలు రావడం సహజం..


మరింత సమాచారం తెలుసుకోండి: