ఏదైనా సినిమా థియేటర్ లలో విడుదలకు సిద్ధంగా ఉంది అంటే ఆ సినిమాపై ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ ని బట్టి ఆ సినిమాకు ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరుగుతూ ఉంటుంది. స్టార్ హీరోలు నటించిన సినిమాలకు, స్టార్ డైరెక్టర్లు దర్శకత్వం వహించిన సినిమాలపై  ప్రేక్షకుల్లో అంచనాలు ఎక్కువ ఉండటం వల్ల అలాంటి సినిమాలకు భారీ ఎత్తున ఫ్రీ రిలీజ్ బిజినెస్ లు జరుగుతూ ఉంటాయి. అలాగే మీడియం రేంజ్ హీరోలు నటించిన సినిమాలకు ఆ సినిమాపై ప్రేక్షకుల్లో ఉన్న అంచనాలను బట్టి ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరుగుతూ ఉంటుంది. ఇది ఇలా ఉంటే తాజాగా దగ్గుబాటి రానా విరాట పర్వం మూవీలో హీరోగా నటించే విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా నటించగా,  ఈ సినిమాకు వేణు ఉడుగుల దర్శకత్వం వహించాడు.

ఈ సినిమాలో ప్రియమణి ఒక పాత్రలో నటించింది. ఈ సినిమా రేపు అనగా జూన్ 17 వ తేదీన థియేటర్లలో విడుదల కాబోతుంది. ఈ సినిమాను దర్శకుడు వేణు అడుగుల నక్సలైట్ బ్యాక్ డ్రాప్ లో ప్రేమ కథ ను మిక్స్ చేసి తెరకెక్కించాడు. రానా, సాయి పల్లవిమూవీ లో హీరో హీరోయిన్లుగా నటించడం , సినిమా నుండి ఇప్పటి వరకు చిత్ర బృందం విడుదల చేసిన ప్రచార చిత్రాలకు మంచి రెస్పాన్స్ రావడంతో ఈ సినిమాకు  ప్రపంచ వ్యాప్తంగా మంచి ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ప్రపంచవ్యాప్తంగా విరాటపర్వం సినిమాకు జరిగిన ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు తెలుసుకుందాం.

నైజాం 4 కోట్లు , సీడెడ్ 2 కోట్లు , ఆంధ్ర 5 కోట్లు .
రెండు తెలుగు రాష్ట్రాలు విరాటపర్వం మూవీ 11 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకుంది.
కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో 1 కోటి .
ఓవర్ సీస్ లో 2 కోట్లు .
ప్రపంచవ్యాప్తంగా విరాటపర్వం మూవీ 14 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకొని 14.50 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్సాఫీస్ బరిలో దిగబోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: